Don't Miss!
- News
Udaipur murder: హంతకులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థతో లింక్, కరాచీలో 40 రోజులు శిక్షణ !
- Sports
Bumrah On Fire: బుల్లెట్టు బంతులు వేసేత్త పా బూమ్ బూమ్ బూమ్ బూమ్ అని..! వాన వల్ల బతికిపోయారు..
- Automobiles
కోట్లు ఖరీదు చేసే లాంబోర్ఘిని కారుతో మరో కాస్ట్లీ కారును ఢీకొట్టిన 10 ఏళ్ల బాలుడు!
- Technology
మే నెలలో 96 మిలియన్ల యూనిట్లకు పడిపోయిన SmartPhone విక్రయాలు!
- Finance
Lottery: నక్కతోక తొక్కిన ట్రక్ డ్రైవర్.. రూ. 7.50 కోట్లు తెచ్చిపెట్టిన లాటరీ టికెట్.. అదృష్టం..
- Lifestyle
పడక గదిలో మీ భర్త లేదా భార్య మీకు దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం
సీఎంతో భేటీ సమయంలో మంచు విష్ణు ట్వీట్ డిలీట్.. ఇప్పుడు పేర్ని నానికి సన్మానం అంటూ!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, ప్రముఖ హాస్యనటుడు అలీ, ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ పోసాని కృష్ణమురళి భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీలో మంచు విష్ణు కనపడక పోవడంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలో మంచు విష్ణు ట్వీట్ చేసి డిలీట్ చేసిన అంశం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

నెలాఖరులోగా
టికెట్ల విషయంలో వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం చిరంజీవి వెల్లడించారు. ఈ వివాదానికి శుభం కార్డు పడిందని తేల్చి చెప్పారు. సినిమా టికెట్ల రేట్లు నిర్ధారణ, రోజూ అయిదు ఆటల ప్రదర్శనకు అనుమతి, ఇతర అంశాలను పరిష్కరించడానికి ఉద్దేశించిన జీవో ఈ నెలాఖరులోగా విడుదల అవుతుందని ఆయన పేర్కొన్నారు.

పాయింట్ లెస్ టాలెంట్
అటు ప్రేక్షకుల, ఇటు చలన చిత్ర పరిశ్రమకు నష్టం కలగని విధంగా ప్రభుత్వం జీవో రిలీజ్ చేయనుందని వెల్లడించారు. అయితే ఈ పరిణామాల మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు ఓ ట్వీట్ చేయడం.. ఆ తర్వాత కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రివర్స్‌లో చేసిన ట్వీట్ అది. మీరు దీన్ని సులభంగా చదవగలిగితే- బ్యాక్ వర్డ్స్‌లో అద్భుతంగా చదవగలిగే శక్తి ఉన్నట్టే. పాయింట్ లెస్ టాలెంట్ మీలో ఉన్నట్టే.. అనేది ఆ ట్వీట్ సారంశం.

మంచు ఫ్యామిలీ దూరంగా
అయితే పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడంతో కొద్ది సేపటికి ఆయన దాన్ని డిలీట్ చేశారు. అయితే చిరంజీవి అండ్ టీమ్ వైఎస్ జగన్ ను కలిసిన వేళ మంచు ఫ్యామిలీ దూరంగా ఉండటంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఇక మా ప్రెసిడెంట్ మంచు విష్ణు మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

మోహన్ బాబు ఇంటికి
అయితే చర్చలకు కీలల పాత్ర పోషించిన మంత్రి పేర్ని నాని స్వయంగా హైద్రాబాద్‌లోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. హైదరాబాదులో మంత్రి బొత్స కుమారుడి వివాహం జరగగా దానికి మంత్రి పేర్ని నాని వచ్చారు. ఆ అనంతరం సినీ నటుడు మోహన్ బాబు ఇంటికి కూడా ఆయన ఆహ్వానం మేరకు వచ్చి చేరుకున్నారు.

చర్చనీయాంశంగా
సీఎం జగన్ తో చిరంజీవి బృందం జరిపిన సమావేశం వివరాలు మోహన్ బాబుకు పేర్ని నాని వివరించారట. ఈ మేరకు మంచు విష్ణు ట్వీట్ చేశారు. పేర్ని నాని గారు ఈ రోజు మా ఇంటికి రావడం ఆనందంగా ఉంది. టికెట్ రేట్ల అంశం మీద ముందుండి చొరవ తీసుకోవడం సంతోషకరమైన విషయం. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మాకు వివరించడం ఆనందంగా ఉంది, తెలుగు సినిమా పరిశ్రమ మేలు కోసం ప్రయత్నిస్తున్నందుకు థ్యాంక్స్ అని ట్వీట్ చేశారు. మొత్తం మీద ఈ ట్వీట్ కూడా చర్చనీయాంశంగా మారింది.