టిక్కెట్ల తొక్కిసలాటలో రామ్ చరణ్ అభిమాని మృతి
కర్నూలు జిల్లాలోని ఎమ్మగనూరులో విషాదం నెలకొంది. స్దానిక శివ థియేటర్‌లో టిక్కెట్ల కోసం తొక్కిసలాట జరగడంతో... ఊపిరాడక రామ్ చరణ్ అభిమాని కన్నయ్య మృతి చెందాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన "గోవిందుడు అందరివాడేలే" సినిమా శివ థియేటర్‌లో ఆడుతుంది.

భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసినా.. థియేటర్ యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారని మృతుడి బంధువులు ఆరోపించారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్‌లో సినిమా చూసేందుకు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది.
ఐతే ప్రేక్షకులకు సరైన ఏర్పాట్లు చేయడంలో థియేటర్ యాజమాన్యం విఫలం కావడం వల్ల ఓ వ్యక్తి మృతికి కారణమైందని అక్కడున్న అభిమానులు విమర్శిస్తున్నారు. థియేటర్ యాజమాన్య వైఖరి నిరసిస్తూ కన్నయ్య మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు.


Click it and Unblock the Notifications











