హన్సిక ఫ్యామిలీ సీక్రెట్స్
హాట్ హన్సిక తాను సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగానంటూ తాజాగా తన కుటుంబ వివరాల చెప్పుకొచ్చింది. మమ్మీ, సోదరుడు ప్రశాంత్ అంతే నా కుటుంబం అంది సింపుల్ గా. అంటే మీ నాన్నగారు అని అడిగితే మమ్మీ పెంపకంలోనే పెరిగాను. సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ నాది. అని చెప్పుకొచ్చింది. ఇక తన సినీ ప్రవేశ ఎంట్రీ గురించి ఈ మధ్య చెప్పుకొచ్చింది. ఆ ఎంట్రీ కాకతాళీయంగా జరిగిపోయిందంటోంది. మమ్మీ డాక్టర్ మోనా..స్కిన్ అంటే హెయిర్ స్పెషలిస్ట్. ఫిల్మ్ స్టార్స్ కూడా మమ్మీ దగ్గరకి వైధ్య సలహాల కోసం తరుచూ వచ్చేవారు. బాలీవుడ్ స్టార్ అరుణ్ ఇరానీ కూడా మమ్మీ క్లయింట్. ఫ్యామిలీ ప్రెండ్ కూడా. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఆమె ప్రధాన కారణం.
నన్ను సినిమా రంగంలోకి తీసుకురావల్సిందిగా మమ్మీకి చెప్తూండేది. అలాగే నన్ను ఈ రంగంలోకి తీసుకురావాలని వ్యక్తిగత శ్రధ్ధ తీసుకునేది. నా పదేళ్ళ వయిస్సులో బాలనటిగా ఎస్కేప్ ఫ్రం టాలిబన్ చిత్రంలో నటించాను. ఆ చిత్రం 2003 ఫిబ్రవరి 13 న రిలీజైంది అంది. ఇక ఎక్సపోజింగ్ గురించి మాట్లాడుతూ...కథ డిమాండ్ మేరకు గ్లామర్ పంచటం ఏ స్టార్ కైనా తప్పనిసరే. అయితే అనవసరంగా అర్ధరహితంగా ఎక్సపోజింగ్ చేయటాన్ని నేనెప్పుడూ అంగీకరంచను అంది. తాజాగా హన్సిక ఐటం సాంగ్ చేసిన బిల్లా రిలీజైంది. అంతకుముందు సంక్రాంతికి ఆమె హీరోయిన్ గా చేసిన మస్కా రిలీజై నెగిటివ్ ఫలితాన్నిచ్చింది.


Click it and Unblock the Notifications











