twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్యపై అపుడు పెట్రేగిపోయారు.... ఇపుడు క్షమాపణలు!

    సూర్య హెచ్చరికతో పెటా ఇండియా ప్రెసిడెంట్ పూర్వా జోషిపుర శనివారం క్షమాపణ కోరుతూ ఓ లేఖ పంపించారు.

    By Bojja Kumar
    |

    చెన్నై: జల్లికట్టు ఉద్యమం తమిళనాడులో ఉవ్వెత్తున ఎగిసి పడిన సందర్భంలో సినీ రాజకీయ, విద్యా, వ్యాపార వర్గాలు ఇలా అందరూ తమ సాంప్రదాయ క్రీడను కాపాడుకునేందుకు మద్దతుగా నిలిచారు. అందులో తమిళ స్టార్ సూర్య కూడా ఒకరు.

    అయితే 'జల్లికట్టు' క్రీడను నిషేదించాలని కోరుతున్న జంతుసంరక్షణ సంస్థ 'పెటా' హీరో సూర్యపై చేసిన ఆరోపణలు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి. సూర్య 'సింగం 3' సినిమా కోసమే జల్లికట్టు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది.

    సూర్య సీరియస్

    సూర్య సీరియస్

    ‘పెటా' ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న సూర్య... వెంటనే తన లాయర్ ద్వారా ఆ సంస్థకు నోటీసులు పంపారు. మీ వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వెంటనే వివరణ ఇవ్వకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు.

    క్షమాపణలు

    క్షమాపణలు

    సూర్య హెచ్చరికతో పెటా ఇండియా ప్రెసిడెంట్ పూర్వా జోషిపుర శనివారం క్షమాపణ కోరుతూ ఓ లేఖ పంపించారు. పొరబాటు వ్యాఖ్యలు చేశామని, మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు.

    సూర్య ఫ్యాన్స్ గమనించాల్సిన న్యూస్ : ‘సింగం 3’ కొత్త రిలీజ్ డేట్...అఫీషియల్ ప్రకటన

    సూర్య ఫ్యాన్స్ గమనించాల్సిన న్యూస్ : ‘సింగం 3’ కొత్త రిలీజ్ డేట్...అఫీషియల్ ప్రకటన

    సూర్య అభిమానులంతా ఎదురుచూస్తున్న మూడో సీక్వెల్‌ చిత్రం 'ఎస్‌ 3'కి రిలీజ్ డేట్ కష్టాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసి ఉన్నా పలు కారణాల వలన వాయిదా పడుతూవస్తోంది. జనవరి 26 న విడుదల కావలసిన ఈ చిత్రం తమిళనాడులో జల్లికట్టు నిరసనల కారణంగా వాయిదా పడింది. కాగా చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ఖరారు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    అంతా షాక్: హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం నడిరోడ్డుపై...! (ఫోటోస్)

    అంతా షాక్: హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం నడిరోడ్డుపై...! (ఫోటోస్)

    హైదరాబాద్: సినిమా హీరోలు స్టార్ హీరో హోదా వచ్చిన తర్వాత జన సమ్మర్ధ ప్రదేశాల్లోకి రావడానికి దాదాపుగా ఇష్ట పడరు. మరి అలాంటిది భార్యకు బైక్ రైడింగ్ నేర్పించడం లాంటి పనులు చేసే అవకాశం అసలు లేనేలేదు. అయితే సౌత్ సూపర్ స్టార్ హోదా దక్కించుకున్న సూర్య మాత్రం అందుకు భిన్నం...పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.

    English summary
    Fewdays back Surya had issued a legal notice to PETA India for calling his voice in favour of Jallikattu as a promotional strategy for his upcoming film 'S3'. Poorva Joshipura, the CEO of PETA India has issued an apology in her letter to Surya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X