For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెగాహీరోల ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన పీటర్ హెయిన్స్ కి తరూస్ అవార్డ్

By Sindhu
|

మెగా హీరోలకు భారీగా యాక్షన్ ఎపిసోడ్ ఇచ్చి వారి సక్సెస్ లో పీటర్ హెయిన్స్ కూడా ఒక్కరుగా మంచి గుర్తింపు పొందారు. మగధీర, ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ తో చరణ్ 14వేల అడుగుల ఎత్తునుండి ఫ్లైట్‌ నుంచి దూకే స్కైడైవింగ్ సన్నివేశాన్ని పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో విజయవంతంగా చిత్రీకరించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నాడు. అలాగే బద్రీనాథ్ సినిమాతో అల్లుఅర్జున్ తోనూ ఫీటర్ హయిన్స్ యాక్షన్ స్టంట్స్ విజయవంతంగా చిత్రీకరించారని సమాచారం.

యాక్షన్ మాస్టర్ పీటర్ హెయిన్స్ కేవలం బద్రీనాథ్ సినిమా కోసమే అల్లు అర్జున్ తో వియత్నాం వెళ్లి వొవిన్ ఆమ్, వియట్ వో తువాట్ అనే రెండు మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకోవడం, అవే కళల్ని 'బద్రీనాథ్"లో ప్రదర్శించడం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ సంచలనమైంది…అందుకే సైఫ్ అలీఖాన్ తన 'ఏజెంట్ వినోద్" మూవీలోని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పీటర్ ని పిలిపించుకొని మరోసారి వియత్నాం వెళ్లాలని సూచించాడట. అంతేకాక సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు సైతం ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఆరాటపడుతున్నారు. అందుకే అటు పీటర్ హెయిన్స్ తో పాటు, ఇటు వియత్నాంలోని మాస్టర్లు కూడా ఆదర్శం అయ్యాడు.

దాంతో ప్రముఖ స్టంట్ మాస్టర్‌గా భారతదేశంలో పేరొందిన పీటర్ హెయిన్స్ పేరు 'తరూస్ వరల్డ్ స్టంట్ అకాడమీ మరియు బ్లూ రిబ్బన్ కమిటీ" సంయుక్తంగా ఇవ్వనున్న అవార్డుల ఎంపికకు నామినేట్ అయ్యింది. 2011 సంవత్సరానికి 'రావణ్" చిత్రంలోని పీటర్ పనితనాన్ని గుర్తించి ఈ గౌరవం ఆయనకు లభించింది. ఈ నెల 14న హాలీవుడ్‌లోని పారమౌంట్ స్టూడియోస్‌లో జరిగే తరూస్ వరల్డ్ స్టంట్ అవార్డ్స్ సంస్థ వ్యవస్థాపక దినోత్సవంలో విజేతల వివరాలు ప్రకటిస్తారు. ఆ వేడుకకు రావలసిందిగా పీటర్‌హెయిన్స్‌ కు ఆహ్వానం లభించింది.

English summary
Peter Haynes, who is one of the top stunt masters in South India was nominated for the best action sequence in ‘Raavan’ for Taurus World Stunt Award. He informed the media that he received the invitation for the awards function which will take place on May 14th at California.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more