Don't Miss!
- News కాంగ్రెస్ లో చేరిక పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగ్ ట్విస్ట్..!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మెగాహీరోల ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన పీటర్ హెయిన్స్ కి తరూస్ అవార్డ్
మెగా హీరోలకు భారీగా యాక్షన్ ఎపిసోడ్ ఇచ్చి వారి సక్సెస్ లో పీటర్ హెయిన్స్ కూడా ఒక్కరుగా మంచి గుర్తింపు పొందారు. మగధీర, ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ తో చరణ్ 14వేల అడుగుల ఎత్తునుండి ఫ్లైట్ నుంచి దూకే స్కైడైవింగ్ సన్నివేశాన్ని పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో విజయవంతంగా చిత్రీకరించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నాడు. అలాగే బద్రీనాథ్ సినిమాతో అల్లుఅర్జున్ తోనూ ఫీటర్ హయిన్స్ యాక్షన్ స్టంట్స్ విజయవంతంగా చిత్రీకరించారని సమాచారం.
యాక్షన్ మాస్టర్ పీటర్ హెయిన్స్ కేవలం బద్రీనాథ్ సినిమా కోసమే అల్లు అర్జున్ తో వియత్నాం వెళ్లి వొవిన్ ఆమ్, వియట్ వో తువాట్ అనే రెండు మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకోవడం, అవే కళల్ని 'బద్రీనాథ్"లో ప్రదర్శించడం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ సంచలనమైంది…అందుకే సైఫ్ అలీఖాన్ తన 'ఏజెంట్ వినోద్" మూవీలోని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పీటర్ ని పిలిపించుకొని మరోసారి వియత్నాం వెళ్లాలని సూచించాడట. అంతేకాక సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు సైతం ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఆరాటపడుతున్నారు. అందుకే అటు పీటర్ హెయిన్స్ తో పాటు, ఇటు వియత్నాంలోని మాస్టర్లు కూడా ఆదర్శం అయ్యాడు.
దాంతో ప్రముఖ స్టంట్ మాస్టర్‌గా భారతదేశంలో పేరొందిన పీటర్ హెయిన్స్ పేరు 'తరూస్ వరల్డ్ స్టంట్ అకాడమీ మరియు బ్లూ రిబ్బన్ కమిటీ" సంయుక్తంగా ఇవ్వనున్న అవార్డుల ఎంపికకు నామినేట్ అయ్యింది. 2011 సంవత్సరానికి 'రావణ్" చిత్రంలోని పీటర్ పనితనాన్ని గుర్తించి ఈ గౌరవం ఆయనకు లభించింది. ఈ నెల 14న హాలీవుడ్‌లోని పారమౌంట్ స్టూడియోస్‌లో జరిగే తరూస్ వరల్డ్ స్టంట్ అవార్డ్స్ సంస్థ వ్యవస్థాపక దినోత్సవంలో విజేతల వివరాలు ప్రకటిస్తారు. ఆ వేడుకకు రావలసిందిగా పీటర్హెయిన్స్ కు ఆహ్వానం లభించింది.