twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    46 సార్లు ఎముకలు విరిగాయి, త్రివిక్రమ్‌ని నాన్న అని పిలుస్తాను: పీటర్ హెయిన్స్ పెయిన్ ఫుల్ స్టోరీ

    |

    Recommended Video

    స్టంట్స్ వల్ల 46 సార్లు ఎముకలు విరిగాయి !

    ఒకప్పుడు సినిమా స్టంట్ సీన్లలో ఫైటర్ గా కనిపించిన హెయిన్స్.. తర్వాతి కాలంలో ఎదగటమే కాదు.. తన ప్రతిభతో స్టంట్ కొరియోగ్రాఫర్ గా జాతీయ స్థాయిలో రాణించాడు. నిలువెత్తు స్ఫూర్తి కథకు నిదర్శనంగా కనిపించే పీటర్ హెయిన్స్ ఇండీవుడ్ ఫిలిమ్ కార్నివాల్‌లో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు.

    14 రీళ్ళలో

    14 రీళ్ళలో

    ఇప్పుడు 14 రీళ్ళలో కనిపించే ప్రతీ సీను వెనకా ఎంతమంది టెక్నీషియన్లున్నారు, ఎవరు ఏపని చేస్తే ఆ సీన్ పండిందీ అన్న దగ్గరనుంచీ అసలు టెక్నీషియన్లని దర్శకుడు ఏ పద్దతిలో ఎక్కడ వాడుకోవటంలో విఫలమయ్యాడూ అన్నది కూడా విశ్లేశించేస్తున్నారు ప్రేక్షకులు...

    ఎముకలు విరగ్గొట్టుకొని

    ఎముకలు విరగ్గొట్టుకొని

    అయితే ఇంత తెలిసిన కాలం లోనూ ఇంకా కొన్ని విషయాలు మనకు తెలియవు.... కెమెరావెనకాల డూప్ లుగా, యక్షన్ సన్నివేశాల్లో ఎగిరెగిరిపడి ఎముకలు విరగ్గొట్టుకొని (కొందరికి కనీస ఇన్స్యూరెన్స్ సౌకర్యం కూడా ఉండదు) మరీ మనకు వినోదాన్నందించే స్టంట్ మాస్టర్లూ, ఫైట్ కొరియో గ్రాఫర్లూ ఇంకా అఙ్ఞాతంగానే ఉండిపోతున్నారు..

    చావునీ, బతుకునీ ఒకేసారి

    చావునీ, బతుకునీ ఒకేసారి

    అలాంటి స్థాయినుంచీ ఇప్పుడు స్టార్ రేంజ్ కి చేరుకున్న పీటర్ హెయిన్స్ సినిమా స్టంట్ మాస్టర్ల జీవితపు చీకటి కోణాలనీ చెప్పుకొచ్చాడు. స్టంట్ మాస్టర్ గా జీవించటం అంటే చావునీ, బతుకునీ ఒకేసారి అనుభవించటం అంటూ పీటర్ చెప్పిన మాటలు కొన్ని ....

     46 సార్లు ఎముకలు విరిగాయి

    46 సార్లు ఎముకలు విరిగాయి

    ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, ప్రేక్షకులను సంతృప్తి పరచడానికే తాను నిత్యమూ ప్రయత్నిస్తుంటానని చెప్పారు. ఫైట్స్ కంపోజింగ్ విషయంలో చాలా సార్లు ప్రమాదాలు జరుగుతుంటాయని, జాకీ చాన్ కు 52 సార్లు ఎముకలు విరిగితే, తనకు 46 సార్లు విరిగాయని అన్నారు.

     సాధారణ వ్యక్తినే

    సాధారణ వ్యక్తినే

    సెట్స్ లో తానెంతో కఠినంగా ఉంటానని, నిజ జీవితంలో మాత్రం సాధారణ వ్యక్తినేనని చెప్పారు. సినిమా కథ డిమాండ్ మేరకు వచ్చే ఫైట్స్ ను బాగా చిత్రీకరించ వచ్చని, పెట్టాలని ఫైట్ పెడితే మాత్రం తాను వ్యతిరేకిస్తుంటానని చెప్పాడు. హాలీవుడ్ తో పోలిస్తే భారత సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు వాస్తవానికి దూరంగానే ఉంటాయని, ఇక్కడి సంస్కృతి, చూసేవారి అంచనాలకు తగ్గట్టుగా ఫైట్స్ డిజైన్ చేస్తుంటామని చెప్పుకొచ్చాడు.

     త్రివిక్రమ్ శ్రీనివాస్

    త్రివిక్రమ్ శ్రీనివాస్

    జాతీయస్థాయిలో సినిమాలు చేస్తున్నా.. హెయిన్స్ ట్రాక్ రికార్డును చూస్తే.. ఎక్కువగా రాజమౌళి చిత్రాల్లో పని చేయటం కనిపిస్తుందా. జక్కన్న స్కూల్లో కీరోల్ ప్లే చేసే పీటర్ హెయిన్స్‌కి మరో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఎంతో ఇష్టమట. ఆయన్ను ప్రేమతో డాడీ అనిపిస్తుంటాడట.

     ప్రేమతో డాడీ అని పిలుస్తాను

    ప్రేమతో డాడీ అని పిలుస్తాను

    తన తండ్రి తనను చదివించకున్నా.. మార్షల్ ఆర్ట్స్ నేర్పించారని.. అదే తనకు జీవితమైందని చెబుతాడు. సినిమా రంగంలో త్రివిక్రమ్ దగ్గర ఎంతో నేర్చుకున్నానని.. అందుకే ఆయన్ను ప్రేమతో డాడీ అని పిలుస్తానని చెప్పాడు. తాను చేసిన సినిమాల్లో అన్ని ఇష్టమేనని.. అన్ని తన బిడ్డలేనని..వాటిల్లో మంచిదంటూ ఏమీ ఉండదని చెప్పుకొచ్చాడు.

    English summary
    The star action choreographer Peter Hein, who is the man in most demand in Indian cinema, has made some interesting comments about the director Trivikram Srinivas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X