twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆరోజు షూటింగ్ లో చచ్చిపోతాననుకున్నా.... ఆఖరిసారి కొడుకుని చూసుకొని ఏడ్చాను:పీటర్ హెయిన్స్

    |

    సినిమా...కొన్ని వందల మంది కల, కొన్ని వేల మంది శ్రమ, కూని లక్షలమంది జీవితం.... కొన్ని కోట్లమంది వినోదం.. ప్రేక్షకుడు రెండున్నరగంటల పాటు తన కష్టాలన్నీ మర్చిపోయేందుకు ఆరునెలలనుంచీ కనీసం సంవత్సర కాలం వందలమంది మనుషులు పనిచేస్తారు... అయితే మనకు కనిపించేది కొంతమందే... కొన్నేళ్ళక్రితం వరకూ మరీ క్లాస్ ఆడియన్స్ కి తప్ప సినిమాని ఎక్కువగా ఆదుకునే బీ, సీ సెంటర్ ఆడియన్స్ కి అసలు సినిమా దర్శకుడేవరో కూడా తెలీదు.

    కానీ ఇప్పుడు కాలం కాస్త ముందుకు కదిలింది 14 రీళ్ళలో కనిపించే ప్రతీ సీను వెనకా ఎంతమంది టెక్నీషియన్లున్నారు, ఎవరు ఏపని చేస్తే ఆ సీన్ పండిందీ అన్న దగ్గరనుంచీ అసలు టెక్నీషియన్లని దర్శకుడు ఏ పద్దతిలో ఎక్కడ వాడుకోవటంలో విఫలమయ్యాడూ అన్నది కూడా విశ్లేశించేస్తున్నారు... అయితే ఇంత తెలిసిన కాలం లోనూ ఇంకా కొన్ని విషయాలు మనకు తెలియవు.... కెమెరావెనకాల డూప్ లుగా, యక్షన్ సన్నివేశాల్లో ఎగిరెగిరిపడి ఎముకలు విరగ్గొట్టుకొని (కొందరికి కనీస ఇన్స్యూరెన్స్ సౌకర్యం కూడా ఉందదు) మరీ మనకు వినోదాన్నందించే స్టంట్ మాస్టర్లూ, ఫైట్ కొరియో గ్రాఫర్లూ ఇంకా అఙ్ఞాతంగానే ఉండిపోతున్నారు.. అలాంటి స్థాయినుంచీ ఇప్పుడు స్టార్ రేంజ్ కి చేరుకున్న పీటర్ హెయిన్స్ సినిమా స్టంట్ మాస్టర్ల జీవితపు చీకటి కోణాలనీ చెప్పుకొచ్చాడు. స్టంట్ మాస్టర్ గా జీవించటం అంటే చావునీ, బతుకునీ ఒకేసారి అనుభవించటం అంటూ పీటర్ చెప్పిన మాటలు కొన్ని ....

    పీటర్ హెయిన్స్:

    పీటర్ హెయిన్స్:

    ఫైట్ మాస్టర్ కీ ఒక స్టార్ రేంజ్ తీసుకువచ్చిన ఫైట్ మాస్టర్లలో ఒకడు "పీటర్ హెయిన్స్. సౌత్ ఇండియాలో స్టైలిష్ యాక్షన్ కోరియోగ్రఫీలో మంచి పేరు తెచ్చుకున్న ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. ‘ఛత్రపతి', ‘మగధీర' సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి తో కలిసి పనిచేసిన పీటర్ హెయిన్స్ ప్రస్తుతం ‘బాహుబలి' సినిమాకి కూడా ఫైట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు.భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్. సౌత్ సినీ ప్రేమికులకైతే కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని స్టార్.

    భారీ ఫైట్లు చేయించాడు:

    భారీ ఫైట్లు చేయించాడు:

    2001లో 'మురారి' ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన స్టంట్‌ మాస్టర్‌ ఇతను. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో హీరోలతో భారీ ఫైట్లు చేయించాడు. ఇప్పుడు 'బాహుబలి' కోసం ప్రభాస్‌, రానా, అనుష్కతో ఫైట్లు చేయిస్తున్నాడు. అతనే వెండితెర పోరాటాల సృష్టికర్త పీటర్‌ హెయిన్స్‌. ఫైట్లతోపాటు ఇతనికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఎత్త్తెన కొండలపై నుంచి తాడు సాయంతో దిగడం, అత్యంత చలి ప్రదేశాల్లో జలపాతాలలో ఈత కొట్టడం వంటి ఇష్టాలున్నాయి.

    చావుకి ఎదురెళ్ళాల్సి వచ్చింది:

    చావుకి ఎదురెళ్ళాల్సి వచ్చింది:

    ముఖ్యంగా శంకర్, రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్స్ కు పీటర్ హెయిన్స్ ఫేవరేట్ గా ఉండటమే కాకుండా.. మగధీర, శివాజీ, రోబో, ఇప్పుడు బాహుబలి లాంటి భారీ సినిమాలకు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు అందించి ఫైట్ మాస్టర్ గా టాప్ చైర్ లో కూర్చున్నాడు. అయితే తాను ఈ స్థాయికి రావటానికి చావుకి ఎదురెళ్ళాల్సి వచ్చింది, పదుల సంఖ్యలో ఎముకలు విరగ్గొట్టుకోవల్సి వచ్చింది, ప్రతీ స్టంట్కి ముందు తన ప్రాణాన్ని అరచేతిలో ఉంచుకోవాల్సి వచ్చింది....

     తాజా ఇంటర్వ్యూలో:

    తాజా ఇంటర్వ్యూలో:

    పీటర్ హెయిన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్లో బాగా కష్టమైన ప్రాజెక్ట్ ‘బాహుబలి' అని. ఈ సినిమాలో తను సుమారు 2000 మంది ఫైటర్స్ నీ ఏనుగులను కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలి. ‘ఇదొక పీరియడ్ ఫిల్మ్. రెగ్యులర్ సినిమాల కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇప్పటికే రాజమౌళి, ప్రభాస్ తో కలిసి పనిచేసాను కాబట్టి నా పనిని కాస్త సులభతరం అవుతోందని' చెప్పిన పీటర్.. తన గత జీవితపు విషయాలనూ చెప్పుకొచ్చాడు.

    ఒంటికి నిప్పు అంటించుకుని:

    ఒంటికి నిప్పు అంటించుకుని:

    ‘శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ఒకేఒక్కడు' సినిమాలో ఓ కీలకమైన సీన్‌లో అర్జున్‌కు డూప్‌గా నటించా. ఓ సీన్‌లో ఒంటికి నిప్పు అంటించుకుని నగ్నంగా పరిగెత్తాలి. వీపు మీద జెల్‌ రాసుకుని పెట్రోల్‌ పోసి నిప్పు అంటించిన తర్వాత పరిగెత్తుకెళ్లి ఓ పెట్టెలో దూకాలి. అలాగే చేశాను. కానీ, అది నాకు తృప్తిగా అనిపించలేదు. అందుకే మరోసారి చేస్తానని చెప్పా.

    భయమేసింది:

    భయమేసింది:

    కానీ, డైరెక్టర్‌ శంకర్‌, ఫైట్‌ మాస్టర్‌ కనల్‌ కణ్నన్‌ వద్దని వారించారు. కానీ, రాజీపడడం ఇష్టంలేక మరోసారి చేస్తానన్నా. దీంతో మరుసటి రోజు అర్ధరాత్రి ఆ సీన్‌ తీయడానికి ప్లాన్‌ చేశారు. అయితే తర్వాతి రోజు నాకెందుకో భయమేసింది.అప్పటికి నా కొడుకు వయసు ఆర్నెల్లు. వాన్ని చూడాలనిపించి ఇంటికెళ్లా.

    చర్మం పూర్తిగా ఊడొచ్చేసింది:

    చర్మం పూర్తిగా ఊడొచ్చేసింది:

    మరుసటి రోజు షూటింగ్‌కు వెళ్తే ఇంటికి తిరిగి రాలేననిపించింది. అందుకే బాత్రూమ్‌లోకి దూరి విపరీతంగా ఏడ్చా. ఆ తర్వాత షూటింగ్‌కు వెళ్లాలనిపించలేదు. నా భార్యను, కొడుకును ఆఖరిసారి చూస్తున్నట్టే అనిపించింది. వారి కళ్లలోకి చూడలేక తలదించుకుని వెళ్లిపోయా. ఇక షూటింగ్‌ స్పాట్‌లో మొదటిసారి ఆ సీన్‌ చేసేటపుడు వీపునకు మంటలు అంటుకుని, చర్మం పూర్తిగా ఊడొచ్చేసింది. కానీ, సీన్‌ బాగా రాలేదు. దాంతో వీపుకు పాన్‌కేక్‌ రాసుకుని మరోసారి ఆ సీన్‌ చేశా'నని చెప్పాడు.

     19 ఎముకలు విరిగాయి:

    19 ఎముకలు విరిగాయి:

    ఇక, మగధీర షూటింగ్‌ సమయంలో బైక్‌ గాల్లోకి ఎగిరే సన్నివేశం తీస్తున్నపుడు చాలా పెద్ద ప్రమాదం జరిగిందన్నాడు. బైక్‌ గాల్లోకి ఎగిరిన తర్వాత తాడు ఊడిపోయి 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డానని, దాంతో శరీరంలోని వివిధ భాగాల్లో 19 ఎముకలు విరిగాయి అప్పుడైతే మొదటి రెండు రోజులూ ఇక నా పని అయిపోయిందీ నేను మంచానికే పరిమితం అనుకున్నా. కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న ఆ ప్రమాదం జరిగిన 11వ రోజు నుంచే ‘రోబో' షూటింగ్‌కు వీల్‌చైర్‌ మీదె వెళ్ళి పని చేసాను.

    డైరక్షన్ లోకి దిగుతున్నాను:

    డైరక్షన్ లోకి దిగుతున్నాను:

    "డైరక్టర్ గా నా తొలి చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇది ఏదో అర్జెంటుగా కంగారులో తీసుకున్న నిర్ణయం కాదు. నేను గత రెండు సంవత్సరాలుగా ఈ డైరక్షన్ క్రాప్ట్ ని నేర్చుకుంటూ వస్తున్నాను. అంతే కాదు పూర్తి హోమ్ వర్క్ తో డైరక్షన్ లోకి దిగుతున్నాను ". అన్నారు. అలాగే...తనకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, శంకర్, మణిరత్నం, త్రివిక్రమ్ వంటి దర్శకులనుంచి సపోర్టు ఉందన్నారు.

    రెండు మాత్రమే ఫైట్ ఎపిసోడ్స్:

    రెండు మాత్రమే ఫైట్ ఎపిసోడ్స్:

    ఇక పీటర్ హెయిన్స్ డైరక్ట్ చేసే చిత్రం యాక్షన్ థ్రిల్లర్ ఉంటుంది..పూర్తి ఫైట్స్ తో ఉంటుందని భావిస్తున్నారు కదా...అలాంటిదేమో కాదు. ఫ్యామిలి ఎమోషన్స్ తో కూడిన చిత్రం అని తెలుస్తోంది. ఇందులో రెండు మాత్రమే ఫైట్ ఎపిసోడ్స్ ఉంటాయి. అవి చాలా రియలిస్టిక్ గా ఉండేలా పీటర్ హెయిన్స్ ప్లాన్ చేస్తున్నారు.

    తొలి రూ.100 కోట్ల సినిమాలకు:

    తొలి రూ.100 కోట్ల సినిమాలకు:

    ఇండియాలో ఉన్న నాలుగు ప్రముఖ సినీ పరిశ్రమల్లో తొలి రూ.100 కోట్ల సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన స్టంట్ మాస్టర్ గా పీటర్ హెయిన్స్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ముందుగా తొలి ఇండియన్ వంద కోట్ల సినిమాగా రికార్డు సృష్టించిన బాలీవుడ్ మూవీ ‘గజిని' తో అలరించిన పీటర్ హెయిన్స్.. తొలి తమిళ వంద కోట్ల మూవీ ‘శివాజీ' కి కూడా స్టంట్ మాస్టర్ గా పనిచేశాడు.

    పులి మురుగన్:

    పులి మురుగన్:

    ఆ తర్వాత తెలుగులో తొలి వంద కోట్ల గ్రాస్ మూవీ ‘మగధీర' కు పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేసి దుమ్మురేపాడు. ఇక తాజాగా తొలి 100 కోట్ల మలయాళ మూవీగా రికార్డులు సృష్టించిన మోహన్ లాల్ ‘పులి మురుగన్' కు కూడా పీటర్ హెయిన్సే ఫైట్స్ కంపోజ్ చేయడం విశేషం.

    నాలుగు ప్రధాన ఇండస్ట్రీల్లో:

    నాలుగు ప్రధాన ఇండస్ట్రీల్లో:

    ఇలా మొత్తం నాలుగు ప్రధాన ఇండస్ట్రీల్లో తొలి వంద కోట్ల సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పీటర్ హెయిన్సే పనిచేయడం విశేషం మాత్రమే కాదు.. అరుదైన విషయం.. అరుదైన రికార్డు కూడా. ఇకపోతే ఇప్పుడు ‘బాహుబలి-2' తో ఇండియన్ బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేయడానికి పీటర్ హెయిన్స్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

    English summary
    Stunt Master Peter Heine shares his experiences when he is working with Rajamauli for "Magadheera"., Peter was injured in an accident, when he was doing Rehearsals for ‘Magadheera’ Bike race stunt..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X