twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ లాల్ అనర్హుడు: ప్రకాష్ రాజ్‌తో సహా 107 మంది సీఎంకు ఫిర్యాదు!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Mohanlal Gets Opposition From 107 Film Industry People

    ప్రకాష్ రాజ్, రీమా కలింగల్‌ సహా 107 మంది మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మోహన్ లాల్ మీద కేరళ సీఎంకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయింది. ఆగస్టులో కేరళ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రధానోత్సవం చేయబోతున్న నేపథ్యంలో వారు ఈ ఫిర్యాదు చేశాడు. ఈ అవార్డ్ ఫంక్షన్‌కు మోహన్ లాల్ చీఫ్ గెస్టుగా ఏ మాత్రం అర్హుడు కాదంటూ వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

     కారణం ఏమిటి?

    కారణం ఏమిటి?

    మోహన్ లాల్ మీద ఈ ఫిర్యాదు చేయడానికి కారణం మలయాళ నటుడు దిలీప్ వ్యవహారమే అని తెలుస్తోంది. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(అమ్మ) అధ్యక్షుడి హోదాలో ఉన్న మోహన్ లాల్.... ఓ నటికి సంబంధించిన కేసులో నిందితుడుగా ఉన్న నటుడు దిలీప్‌ను మళ్లీ తిరిగి ‘అమ్మ'లోకి తీసుకోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

     సీఎంకు లేఖ

    సీఎంకు లేఖ

    ఈ మేరకు 107 మంది సభ్యులు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, సాంస్కృతిక శాఖ మంత్రి ఎకె.బాలన్‌కు లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ప్రకాష్ రాజ్, ప్రముఖ రచయిత ఎన్.ఎస్.మాధవన్, సేతు, సచ్చిదానందన్, రీమా కలింగల్, గీతూ మోహన్ దాస్ తదితరులు ఉన్నారు.

     డబ్ల్యుసిని నుండి ఇప్పటికే ఒత్తిడి

    డబ్ల్యుసిని నుండి ఇప్పటికే ఒత్తిడి

    దిలీప్‌ను ‘అమ్మ'లోకి తీసుకున్న నేపథ్యంలో మోహన్ లాల్ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలువురు నటీమణులు ‘అమ్మ' నుండి తప్పుకున్నారు. ‘ఉమెన్ ఇన్ కలెక్టివ్ సినిమా'(డబ్ల్యుసిసి) పేరుతో సపరేట్ వింగ్ ఏర్పాటు చేసుకున్నారు.

    మలయాళ పరిశ్రమలో ఊహించని పరిణామాలు

    మలయాళ పరిశ్రమలో ఊహించని పరిణామాలు

    మలయాళ పరిశ్రమలో రోజు రోజుకు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దిలీప్ వ్యవహారంలో ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే వాదన సైతం వినిపిస్తోంది. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

    English summary
    107 people including people from the film industry, have written to the Kerala government that Malayalam superstar Mohanlal should not be invited as the Chief Guest to the annual state film awards to be held in Thiruvananthapuram in August.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X