చిక్కుల్లో కమల్ హాసన్ ‘విశ్వరూపం-2’... రూ. 5.44 కోట్లు చెల్లించాల్సిందే!

By Bojja Kumar

కమల్ హాసన్ నటించిన 'విశ్వరూపం 2' ఆగస్టు 10న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇపుడు వివాదంలో పడింది. ఈ మూవీ విడుదల చేయడానికి వీల్లేదంటూ పిటీషన్ దాఖలైంది.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం... పిరమిడ్ సైమీరా ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ సివిల్ సూట్ దాఖలు చేసింది. మర్మయోగి ప్రాజెక్టు కోసం కమల్ హాసన్‌కు ఈ సంస్థ రూ. 4 కోట్లు చెల్లిందని, అయితే ఈ సినిమా ఎలాంటి పురోగతి సాధించలేదని, ఈ ప్రాజెక్టుపై ఆయన ఆసక్తి చూపడం కానీ, తిరిగి డబ్బులు ఇవ్వడం కానీ చేయక పోవడమే ఈ సూట్ వేయడానికి కారణమని తెలుస్తోంది.

 రూ. 5.44 కోట్లు చెల్లించాల్సిందే

రూ. 5.44 కోట్లు చెల్లించాల్సిందే

తమకు రావాల్సిన డబ్బు వెంటనే చెల్లించాలని, వడ్డీతో కలిపి రూ. 5.44 కోట్లు తమకు కట్టాల్సిందే అని సదరు సంస్థ డిమాండ్ చేస్తుంది. తమకు డబ్బు సెటిల్మెంట్ చేసే వరకు ‘విశ్వరూపం 2' సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని కోర్టును ఆశ్రయించారు.

రాజకీయాల్లోకి కమల్.... అందుకే ఒత్తిడి

రాజకీయాల్లోకి కమల్.... అందుకే ఒత్తిడి

కమల్ హాసన్ రాజకీయాల్లోకి వెళుతున్న నేపథ్యంలో ఆయన మళ్లీ సినిమాలను సీరియస్‌గా చేస్తారనే నమ్మకం లేకనే విశ్వరూపం 2 విడుదల ముందే ఆయనపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. విశ్వరూపం 2తో పాటు... ఆయన నటించిన శభాష్ నాయుడు, ఇండియన్ 2 చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.

విశ్వరూపం 2

విశ్వరూపం 2

విశ్వరూపం 2 సినిమా విషయానికొస్తే... ఈ చిత్రాన్ని ఆగస్టు 10న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ప్రస్తుతం కమల్ ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

 ప్రమోషన్స్‌లో కమల్ బిజీ బిజీ

ప్రమోషన్స్‌లో కమల్ బిజీ బిజీ

హైదరాబాద్‌లో గురువారం జరిగిన విశ్వరూపం 2 తెలుగు వెర్షన్ ఆడియో వేడుకలో కమల్ హాసన్ పాల్గొన్నారు. దీంతో పాటు ఆయన తెలుగు బిగ్‌బాస్ షోలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తమిళం, హిందీలో కూడా ఆయన ప్రమోషన్స్ నిర్వహించబోతున్నారు.

సీక్వెల్

సీక్వెల్

2013లో వచ్చిన విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా ‘విశ్వరూపం 2' రూపొందుతోంది. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్ ముఖ్య పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X