'రక్త చరిత్ర' ప్రదర్శన ఆపాలంటూ పిటిషన్
ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన ఘటనలను అతిగా చూపడం వల్ల రాష్ట్రంలోని రెండు సామాజికవర్గాల మధ్య సఖ్యత దెబ్బతినే ప్రమాదముందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. హింసను ప్రేరేపిస్తూ, ఒక సామాజికవర్గాన్ని ప్రజలు అసహ్యించుకునే విధంగా చిత్రీకరించిన 'రక్తచరిత్ర' సినిమాను తక్షణమే నిషేధించాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలైంది. ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి, ఇతర నేతలు ఎస్.రాజశేఖర్, యు.కృష్ణారావు తదితరులు దీనిని దాఖలు చేశారు. లాభార్జనే లక్ష్యంగా తీసిన ఈ చిత్రంతో సమాజానికి ఎటువంటి మేలు జరగకపోగా, నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. ఒకవైపు 'రియల్ స్టోరీ' అని, మరోవైపు 'కల్పితం' అని ప్రచారం చేస్తూ ప్రజలను చిత్ర దర్శక, నిర్మాతలు అయోమయానికి గురిచేస్తున్నారని వారు ఆరోపించారు.
రక్త చరిత్ర పరిటాల సునీత సూర్య వివేక్ ఒబరాయ్ రామ్ గోపాల్ వర్మ rakta charitra paritala sunitha surya vivek oberoi ram gopal varma


Click it and Unblock the Notifications