రామ్ చరణ్ గేమ్‌ఛేంజర్‌ ఓవర్సీస్‌ రైట్స్‌‌కు భారీ ధర, బ్రేక్ ఈవెన్ కావాలంటే..?

ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్. తమిళ దర్శక దిగ్గజం శంకర్ తెలుగులో చేస్తున్న తొలి స్ట్రెయిట్ మూవీ ఇదే కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అప్పట్లో జరగండి.. జరగండి సాంగ్ మినహా మరే మేజర్ అప్‌డేట్ ఈ మూవీ నుంచి రాలేదు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఏదైనా ట్రీట్ ఇస్తారనుకుంటే అదీ లేకపోవడంతో అభిమానులు బాగా డిజప్పాయింట్ అవుతున్నారు.

క్రిస్మస్ కానుకగా గేమ్ ఛేంజర్‌ను రిలీజ్ చేస్తామని ఇటీవలే నిర్మాత దిల్‌రాజ్ చెప్పి కాస్తంత ఊరట కలిగించారు. మొన్నామధ్య థమన్ మాట్లాడుతూ.. ఆగస్ట్ చివరి నుంచి వరుసగా అప్‌డేట్స్ వస్తాయన్నారు. నిజానికి జరగండి ఫస్ట్ సాంగ్ గతేడాది దీవాళికే రావాల్సి ఉంది.. కానీ పాట లీక్ కావడం, సోషల్ మీడియాలో నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో ట్యూన్‌లో మార్పులు చేసి చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేశారు.

Phars Film bags mega power star ram charan - shankar s game changer movie overseas rights here s the details

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా గేమ్ ఛేంజర్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. ఎన్నో ఆశలు పెట్టుకుని, మరెన్నో అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు -2 దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదని శంకర్ అండ్ కో జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాలీవుడ్ టాక్. ఇలాంటి విషయాల్లో ముందుండే స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు దగ్గరుండి మరి రషెస్ చేస్తున్నారట.

మరోవైపు.. గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి తన పాత్ర షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆలస్యమై విమర్శలు ఎదుర్కొంటు ఉండటంతో శంకర్ కూడా చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు. ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేసిన తర్వాత రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని ఇటీవలే శంకర్ కూడా వెల్లడించారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Phars Film bags mega power star ram charan - shankar s game changer movie overseas rights here s the details

ఇదిలాఉండగా.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్‌ను పార్స్ ఫిల్మ్ రూ.20 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. దీంతో గేమ్ ఛేంజర్ ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 5.1 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్‌ రేంజ్‌కి వెళ్లిన రామ్ చరణ్‌కు విదేశాల్లోనూ ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన నెక్ట్స్ మూవీపై భారీ అంచనాలుండటం, పైగా శంకర్ దర్శకుడు కావడంతో రైట్స్ మంచి ధర పలికింది. గేమ్ ఛేంజర్‌కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు అదిరిపోతాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Read more about: phars film ram charan shankar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X