»   » 'బాహుబలి' ట్రైలర్ చూసా..మైండ్ బ్లాంక్ అయ్యింది

'బాహుబలి' ట్రైలర్ చూసా..మైండ్ బ్లాంక్ అయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న చిత్రం 'బాహుబలి' . ఈ చిత్రాన్ని మే 15 న విడుదల చేస్తున్నట్లు దర్శక, నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు ట్రైలర్స్ రెడీ చేస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ట్రైలర్ ని రాజమౌళి

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


కుటుంబానికి చెందిన సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి చూడటం జరిగింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.


కళ్యాణ్ కోడూరి ట్వీట్ చేస్తూ... "ఇప్పుడే బాహుబలి త్వరలో రిలీజ్ కానున్న ట్రైలర్ ని చూసాను. మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇది ఓ ఎపిక్ ". అంటూ ఉద్వేగంగా రాసుకొచ్చారు. ఉగాది పూట రాజమౌళి అభిమానులుకు ఇది సంతోషపరిచే వార్తే మరి.


బిజినెస్ విషయానికి వస్తే... ఈ చిత్రానికి సంబందించిన హిందీ రైట్స్‌ను కరణ్ జోహార్ లాంటి దిగ్గజ దర్శక-నిర్మాత సొంతం చేసుకున్నాడట. ఈ రైట్స్ దక్కించుకోవడానికి కరణ్ భారీ మొత్తం చెల్లించారని సమాచారం.


Phenomenal response for Baahubali Trailer!

అయితే ఎంత మొత్తం లో చెల్లించారనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరో వైపు రెండు భాగాలుగా వస్తున్న బాహుబలి చిత్ర టీవీ హక్కులను ఓ ప్రముఖ టీవీ సంస్ద రూ.20 కోట్లకు దక్కించుకుందని తెలిసింది. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా లు ప్రధాన పాత్రదారులుగా వస్తున్న ‘బాహుబలి' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.


ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. 'బాహుబలి' గా ప్రభాస్‌ రూపమేంటో ఇప్పటికే ప్రేక్షకులకు చూపించారు రాజమౌళి. తొలి రూపు (ఫస్ట్‌లుక్‌)తోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో రెండో పోస్టరును విడుదల చేశారు. ఈ రెండు ఈ వీరుడి సాధారణ రూపాలు. మరి యుద్ధభూమిలో 'బాహుబలి' ఎలా ఉండబోతున్నాడు అనే ఆతృత అందరిలోనూ కలిగింది. ఓ వైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.


రాజమౌళి అయితే వీలైనంత త్వరలో ఈ సాంకేతికత అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నారు. ఈ విషయం గురించి రూపొందించిన వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టారు. ఈ చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

English summary
Music Director Kalyan Konduri commented - "Just watched Bahubali yet to be released trailer. Mind blank ayipoyindi. This is an epic".
Please Wait while comments are loading...