అతనితో ఎఫైర్ నిజమే! ఈ సంవత్సరమే బిపాసా బసు పెళ్లి!
ముంబై: మొత్తానికి బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు తన సీక్రెట్ ఎఫైర్ విషయం బయట పెట్టింది. హర్మాన్ బవేజాతో డేటింగ్ చేస్తున్నట్లు అంగీకరించింది. గత కొంతకాలంగా బిపాసా బసు బాలీవుడ్ నటుడు హర్మాన్ బవేజాతో కలిసి తిరుగుతోంది. అయితే ఇంత కాలం ఈ జంట తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని బుకాయిస్తూ వచ్చారు. అయితే తాజాగా బిపాసా తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని బయట పెట్టింది. ఈ సంవత్సరమే ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.
'ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. హర్మాన్ బవేజా, నేను దంపతులం కావాలని అనుకుంటున్నాం. మమ్మల్ని దీవించండి' అంటూ బిపాసా బసు తన ట్విట్టర్ పేజీలో పేర్కొంది. బిపాసా బసు స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బయట పెట్టడం చర్చనీయాంశం అయింది.

మొత్తానికి బిపాసా బసు ట్విట్టర్ ద్వారా హర్మాన్ బవేజాతో ఉన్న సంబంధాన్ని బయట పెట్టడం, దంపతులం కాబోతున్నామని ప్రకటించడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆమె పెళ్లికి సిద్ధమైనందుకు ఆనంద పడుతున్నారు. హర్మాన్‌తో బిపాసా లైఫ్ కూల్‌గా సాగి పోవాలని కోరుకుంటున్నారు.
గతంలో బిపాసా బసు, జాన్ అబ్రహం కలిసి సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల పాటు ఇద్దరి మధ్య ఎఫైర్ నడించింది. అనంతరం ఇద్దరి మధ్య విబేధాలు రావడం, విడిపోవడం తెలిసిందే. జాన్ అబ్రహం ఇటీవలే ప్రియా రాంచల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











