పూంక్ సీక్వెల్ సూపర్ హిట్: రామ్ గోపాల్ వర్మ

By Srikanya

తన లేటెస్ట్ చిత్రం ఫూంక్ సీక్వెల్ (ఆవహం) మంచి విజయం సాధించింది అంటున్నారు ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ. ఆయన తన బ్లాగ్ లో ఈ విషయాలను ప్రస్ధావిస్తూ ఫూంక్ సీక్వెల్ (తెలుగు, తమిళ భాషలు) లేకుండా ఐదున్నర కోట్లు మొదటి మూడు రోజుల్లో కలెక్టు చేసింది. అదే అమితాబ్ బచ్చన్ తో తీసిన రణ్ చిత్రం అదే సమయంలో కేవలం రెండు కోట్ల అరవై లక్షలు మాత్రమే సంపాదించింది. అలాగే రణ్ తో పోలిస్తే ఫూంక్ చిత్రం బడ్జెట్ చాలా తక్కువ, అంతేగాక పబ్లిసిటీ బడ్జెట్ కూడా రణ్ కి ఖర్చు పెట్టిన దాంట్లో సగం కూడా లేదు. దాన్ని బట్టి ఈ చిత్రాన్ని నేను సూపర్ హిట్ గా భావిస్తున్నాను అన్నారు. ఫూంక్ చిత్రం సీక్వెల్ క్రిందటి శుక్రవారం రిలీజైంది. ఈ హర్రర్ ఎరవనీ ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం వర్మ రక్త చరిత్ర చిత్రం రూపకల్పనలో బిజీగా ఉన్నారు. పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వివేక్ ఒబరాయ్, సూర్య కీలకమైన పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X