అదిరింది : 'బాహుబలి' సూపర్ సెల్ఫీ మూమెంట్ (ఫొటో)
హైదరాబాద్ : ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రధారులుగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న చిత్రం 'బాహుబలి' . ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. హిందీలో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, ఎ.ఎ.ఫిల్మ్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సినిమా తెలుగు ట్రైలర్‌ను చిత్రబృందం సోమవారం కొన్ని థియేటర్లతో పాటు, ఆన్‌లైన్‌లో కూడా విడుదల చేసింది. హిందీ ట్రైలర్‌ను కరణ్ జోహార్ ఆధ్వర్యంలో ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ముంబైలో కరుణ్ జోహార్, ప్రభాస్, రాజమౌళి, అనుష్క, రానా తో కలిసి ఓ సరదా సెల్ఫీని దిగారు. ఆ సెల్ఫీనే మీరు ఇక్కడ చూస్తున్నది.

ఇప్పటివరకు ఫస్ట్‌లుక్‌ల రూపంలో విడుదల చేసిన ప్రధాన పాత్రలన్నీ ట్రైలర్‌లో కనిపించాయి. సినిమా నేపథ్య ప్రాంతం 'మహిష్మతి' రాజ్యం పరిచయమైంది. ముంబయిలో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా తదితరులు పాల్గొన్నారు.
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్... ‘బాహుబలి' టీంను ఇంట్రడ్యూస్ చేసారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ...దాదాపు రెండున్నరేళ్ల పాటు బాహుబలి షూటింగ్ కొసాగింది. గతంలో ఏ తెలుగు సినిమాలో లేని విధంగా భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్, పోరాట సన్నివేశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో వార్ మూవీని ‘బాహుబలి' పేరుతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు అన్నారు.
అలాగే...సినిమా నిర్మాణంలో తాము ఎదుర్కొన్న పరిస్థితులను గురించి ఈ సందర్భంగా రాజమౌళి వెల్లడించారు. కరణ్ జోహార్ లాంటి ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్ బాహుబలి చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్న నేపథ్యంలో సినిమాపై ముందు నుండీ అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా హిందీ వెర్షన్ ‘బాహుబలి' విడుదలైన తర్వాత బాలీవుడ్ సర్కిల్ లో ఈ మూవీ హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications











