For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇరగతీసే పనిలో...: రవి వర్మ తో అఖిల్...(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్: అందరి దృష్టీ అఖిల్ తొలి చిత్రం మీదే ఉంది. అందుకే మరింత శ్రద్దగా దృష్టి పెట్టి,కష్టపడి చేస్తున్నాడు అఖిల్. తన తొలి చిత్రం రిలీజ్ కాకముందే స్టార్ హోదా సంపాదించుకున్న అఖిల్ ...ఈ చిత్రంలో తాను డాన్స్ లు,ఫైట్స్,నటన ఈ మూడు ఫెరఫెక్ట్ గా చేయగలనని అనిపించుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. అందుకు తగినట్లుగా వినాయిక్ ...టీమ్ ని ఏర్పాటు చేసారు. ఇదిగో ఇక్కడ స్టార్ స్టంట్ కొరియోగ్రాఫర్ రవి వర్మ తో అఖిల్ దిగిన ఫొటో ఉంది. చూడండి. ఈ చిత్రంలో ఫైట్స్ ను స్పెషల్ డిజైన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. హీరో, రవి వర్మ కలిసి అద్బుతం చేసే పనిలో ఉన్నారని టీమ్ అంటోంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  అఖిల్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ నిర్మిస్తున్నారు. సాయేషా సైగల్ కథానాయిక. ప్రస్తుతం స్పెయిన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఫైట్ మాస్టర్ రవివర్మ నిర్ధేశకత్వంలో రొమాంచితమైన పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.

  వీటికి సంబంధించిన విశేషాల్ని అఖిల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. స్పెయిన్‌లో నిర్విరామంగా షూటింగ్ చేస్తున్నాం. నాపై చిత్రీకరిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.

   Photo: Akhil with Ravi Varma

  త్వరలో యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన చిత్రాల్ని పోస్ట్ చేస్తాను. అంతవరకు వేచి చూడండి అంటూ ట్విట్టర్‌లో స్పందించారు అఖిల్. స్పెయిన్ షెడ్యూల్ అనంతరం హైదరాబాద్‌లో ఓ పాటని చిత్రీకరిస్తారని, జూన్ నెలలో యుగాండాలో మరో షెడ్యూల్ జరపనున్నట్లు చిత్ర బృందం చెబుతోంది.

  వి.వి.వినాయక్ తనదైన శైలిలో పవర్‌ఫుల్ మాస్ అంశాల మేళవింపుతో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని, అక్కినేని అభిమానులు, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలన్నీ ఈ సినిమాలో వుంటాయని నిర్మాత నితిన్ తెలిపారు.

  అందులోనూ ఇంత మంచి టీమ్ తో కలసి పని చేస్తుండటంపై అఖిల్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడట. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు అక్కినేని చిన్నోడు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అఖిల్ కు తండ్రిగా నటిస్తుండగా... సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి దుర్గా నవరాత్రులకు ముస్తాబవుతున్న తన తొలి చిత్రంతో అఖిల్ ఈ ఏడాది దసరా బుల్లోడు అవుతాడేమో చూడాలి అంటున్నారు అభిమానులు.

  నిర్మాత నితిన్ మాట్లాడుతూ...ఈ సినిమా ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసే అన్ని అంశాలతో వినాయక్ ఈ సినిమాని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఒక సాంగ్‌ని సెట్‌లో చిత్రీకరించబోతున్నాం. జూన్‌లో 35 రోజులపాటు యుగాండాలో భారీ షెడ్యూల్‌ వుంటుంది. వెలిగొండ శ్రీనివాస్‌, కోన వెంకట్‌, అనూప్‌ రూబెన్స్‌, ఎస్‌.ఎస్‌.థమన్‌, అమోల్‌ రాథోడ్‌, ఎ.ఎస్‌.ప్రకాష్‌, రవివర్మ వంటి టాప్‌ టాప్‌ టెక్నీషియన్స్‌ ఈ చిత్రాన్ని పెద్ద హిట్‌ చెయ్యాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు'' అన్నారు.

  అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

  English summary
  Here in the picture, Akhil poses with stunt director Ravi Verma who is choreographing a racy action scene on Akhil and others at Metropol Parasol (Mushroom building) in the city of Seville, Spain.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X