కేక ఫొటో: అల్లు బ్రదర్శ్ అనురాగం
హైదరాబాద్: కొత్త జంట హీరో అల్లు శిరీష్ ఈ రోజు 29 సంవత్సరంలోకి ప్రవేశించాడు. దాంతో అల్లు అర్జున్ తన సోదరుడుకి ఇలా కేకు తినిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త జంట కమర్షియల్ గా ఓకే అనిపించుకోవటంతో అల్లు శిరీష్ ఉత్సాహంగా ఉన్నాడు. గుర్తింపు తెచ్చుకున్న హీరోగా ఈ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు.ఇక ఈ ఫొటోలో అల్లు అర్జున్ కొద్ది పాటి గెడ్డంతో క్యాజువల్ లుక్ తో రగ్గడ్ గా కనిపించటం గమనించవచ్చు.
'అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్ ...అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు పూజా కార్యక్రమాలు జరిగాయి. 'జులాయి' తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తూండటంతో అంతటా ఓ రేంజి లో క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఈ నెల్లో గ్రాండ్ గా సిని పెద్దల సమక్షంలో లాంచ్ చేయటానికి నిర్మాత రాధాకృష్ణ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పవన్ కొత్త పార్టీ పెడుతూ జనం మధ్యకు వస్తూండటంతో త్రివిక్రమ్ ఆ వ్యవహారాల్లో పూర్తి బిజీ అయ్యిపోయారు. ఈ నేపధ్యంలో బన్నీ సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

రేసు గుర్రం తర్వాత గోపీచంద్ మలినేనితో పండుగ చేస్కో చిత్రం చేయటానికి స్క్రిప్టు వర్క్ జరిగింది. అయితే త్రివిక్రమ్ తో ఓకే చేయటంతో అదిప్పుడు రామ్ దగ్గరకి వెళ్లింది. అటు హరీష్ శంకర్ చిత్రమూ రిజెక్టు చేసారు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ చిత్రం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్. అయితే ఎలక్షన్స్ అయ్యేదాకా త్రివిక్రమ్ ఖాళీ పడలేదు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంపై అభిమానులు భారీగానే అంచనాలు పెంచుకొంటున్నారు.
దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కబోతోంది. ఇందులో అల్లు అరవింద్ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్. మరో ప్రక్క అల్లుఅర్జున్ 'రేసుగుర్రం' రీసెంట్ గా రిలీజయ్యి సూపర్ హిట్టైంది.


Click it and Unblock the Notifications











