»   » ఇంత హాటా?: టు పీస్ బికినీలో 'ఐ' భామ (ఫొటో)

ఇంత హాటా?: టు పీస్ బికినీలో 'ఐ' భామ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బికినీతో ఎప్పటికప్పుడు ఫొటో షూట్ లతో సిద్దంగా ఉంటూ... హాట్ గా ఉండే హీరోయిన్ ఎవరూ అంటే తడుముకోకుండా చెప్పే పేరులా మారింది అమీ జాక్సన్ ది. ఆమె 'ఐ' చిత్రంలో చేసిన తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టీని ఆకర్షించింది. ఆమెకు వరస పెట్టి ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె చాలా సంతోషంగా ఉంది ఈ పరిణామంతో. ఈ నేపధ్యంలో ఆమె ఇదిగో ఇలా బికినీ తో ఫొటో దిగి విడుదల చేసింది. ఆ ఫొటోనే మీరు చూసింది. ఇది చూసిన వాళ్లు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.

శంకర్, విక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన 'ఐ' చిత్రంలో నటించిన అమీ జాక్సన్ ని ఒక పట్టాన మర్చిపోవటం కష్టమే. ఈ బ్యూటీ తన అందాలతో వెండితెరని వేడిక్కించింది. తాజాగా మరోసారి ఇలా.. బికినీ వేసి తన ఫ్యాన్స్ కు పండుగ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు ఆమె అభిమానులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో షేర్ చేసి,కామెంట్స్ చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అమీ జాక్సన్ మాట్లాడుతూ....చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేనాటికి నాపై ఎలాంటి పుకార్లు వచ్చినా ఓ తెగ కంగారు పడిపోయేదాన్ని. గాసిప్పులు సాధారణం అని తెలిసినా తట్టుకోలేకపోయేదాన్ని. మరి ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు. ధైర్యం వచ్చేసింది అంటోంది అమీ జాక్సన్‌. ఇటీవల ఈమె నటించిన 'ఐ' చిత్రం విడుదలైంది. అమీ కెరీర్‌ తొలినాళ్లలో గాసిప్పులంటే బాగా భయపడేదట.

Photo: Amy Jackson very hot in Bikini

అమీ మాట్లాడుతూ ''19 ఏళ్ల వయసులో ఉండగా 'ఏక్‌ దివానా థా'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాను. అప్పుడు నాకు పరిశ్రమలో తెలిసివాళ్లు అంతగా లేరు. నాపై మీడియాలో ఏ చిన్న పుకారు వచ్చినా భయపడేదాన్ని. ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటున్నాను'' అని చెప్పింది.

బాలీవుడ్‌ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ''గౌతమ్‌ మీనన్‌తో పనిచేయాలనే ఉద్దేశంతోనే 'ఏక్‌ దివానా థా'తో బాలీవుడ్‌కు పరిచయమయ్యాను. ఆ సినిమా తమిళ మాతృక సూపర్‌ హిట్‌. దక్షిణాది సినిమాలతో వెండితెరకు పరిచయమయ్యుంటే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల నుంచి అవకాశాలు మరింత ఎక్కువగా వచ్చుండేవేమో. ఏదైనా చివరకు భారతీయ సినిమాలో నటించడమే కదా''అని చెప్పింది అమీ.


అమీ జాక్సన్ మాట్లాడుతూ... 'శివతాండవం'లో తొలిసారి విక్రమ్‌ సరసన నటించే అవకాశం. 'ఎవడు'లో రామ్‌చరణ్‌ పక్కన అవకాశం వచ్చింది. నేను అది వరకు చేసినవి చాలా సీరియస్‌ పాత్రలు. ఇందులో కొంత కామెడీ ఉంది, జాలీగా అనిపిస్తుంది. ఒప్పుకున్నాను. అప్పుడే హైదరాబాద్‌ వచ్చాను. తెలుగు రాకపోయినా.. హైదరాబాద్‌ చాలా నచ్చేసింది. ఆ చిత్రం ముగుస్తుండగానే శంకర్‌ నుంచి 'ఐ' పిలుపొచ్చింది.

ఆరోజు ఎగిరి గంతేసినంత పనిచేశా. ఒకే చిత్రంలో నలుగురు గొప్ప కళాకారులు.. శంకర్‌, పీసీ శ్రీరామ్‌, ఏఆర్‌ రెహ్మాన్‌, విక్రమ్‌తో పనిచేసే అవకాశం వచ్చిందంటే.. ఐ యామ్‌ లక్కీ కదా! మామూలుగా శంకర్‌ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా పనుండదని అంటారు. కానీ ఇది వేరు. ఇదో లవ్‌ థ్రిల్లర్‌ అనొచ్చు. నా జీవితంలో మిగతా చిత్రాలన్నీ ఒకెత్తయితే ఇదొక్కటే ఒకెత్తు. ఈ ఒక్క చిత్రానికే రెండేళ్లు తీసుకున్నాను. ఆ కష్టం వృథా పోలేదు. ఆడియో వేడుకలో శంకర్‌, విక్రమ్‌ ప్రశంసలు నా జీవితంలో మరవలేనివి. ఆ మాటలకు ఎంత ఐసైపోయానో చెప్పలేను అన్నారు.


ఇక భారత్‌కి వచ్చాక ఇక్కడి సంస్కృతినీ, భాషనీ అర్థం చేసుకోవడం కష్టమే అయినా పెద్దగా ఇబ్బంది పడ్డది లేదు. నేను తీవ్రంగా బాధపడ్డ అంశాలు వేరే ఉన్నాయి. నా రెండో చిత్రం నుంచే ఒక్కసారిగా నన్ను పుకార్లు చుట్టుముట్టాయి. మొదట్లో చాలా బాధపడ్డా. పట్టించుకోవడం మానేశా. నేను కేవలం మోడల్‌నయితే ఇలాంటివి వచ్చి ఉండకపోవచ్చుగానీ... సినిమా అన్నాక తప్పదు కదా అని సర్ది చెప్పుకున్నా అన్నారామె.

అలాగే...కానీ గాసిప్స్‌కంటే నా మనసుని కలచివేసిన అంశం మరొకటుంది. 'ఈ తెల్లమ్మాయి మనదేశంలో పని చేయడమేమిటీ.. మనకెవరూ లేరా.. ఈ దేశం గొడ్డుబోయిందా!' అన్న గగ్గోలు మొదలైంది. ఈ దేశాన్ని రెండో పుట్టిల్లుగా భావిస్తున్న నాకవి చెంపపెట్టులా తగిలాయి. చాలా బాధపడ్డా. కానీ అవి చేసేవాళ్లు కొందరేననీ... ఇక్కడి సామాన్యులు దేశం, మతం, జాతులకతీతంగా అందర్నీ అక్కున చేర్చుకోగలరని అర్థమైంది. భారత్‌ గొప్పతనం అదే! అందుకే ఈ దేశాన్ని నేనింతగా ప్రేమిస్తున్నా అని చెప్తున్నారు.

English summary
Amy Jackson Sporting a two-piece blue-coloured swimsuit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu