For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళి ఆశీర్వదిస్తున్న గజరాజు, ఇంకో ఫొటో కూడాను

  By Srikanya
  |

  హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం షూటింగ్‌ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 'బాహుబలి' సెట్స్‌లో గజరాజు తనను ఆశీర్వదిస్తున్న ఓ ఫొటోను ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

  A curious elephant blesses a happy me!! #BaahubaliMemories

  Posted by SS Rajamouli on 20 October 2015

  ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా తదదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

  భారతీయ సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది 'బాహుబలి'. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందింది. మన దేశంలో అత్యధిక స్థూల వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.

  'మహాభారతం' తెరకెక్కించాలనే ఉంది కానీ అది అసంభవం అంటూ తేల్చి చెప్పారు రాజమౌళి. ఈ ప్రాజెక్టు వచ్చే టెక్నికల్ సమస్యలు గురించి ఆయన మాట్లాడారు.

  'బాహుబలి'తో అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకున్నారు దర్శకుడు రాజమౌళి. తన కలల ప్రాజక్టు 'మహాభారతం' అని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ విషయం గురించి ఇటీవల ఐఐటీ మద్రాసు విద్యార్థులతో ముచ్చటించినప్పుడు కాస్త విపులంగా మాట్లాడారు.

  Photo:Elephant blesses Rajamouli

  రాజమౌళి మాట్లాడుతూ...''మహాభారతం' కథను సినిమాగా తీయాలని ఉంది. అయితే దీని కోసం పదేళ్లు కష్టపడాలి. ఒకవేళ ఆ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చితే నాలుగు భాగాలుగా తీస్తాను. కానీ ఈ సినిమాకు ప్రధాన ఇబ్బంది నటీనటులు దొరకడం. కనీసం ఆరేళ్లపాటు వారు తమ కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అది అసంభవం''అని చెప్పారు రాజమౌళి. ఒకవేళ అలా సుదీర్ఘంగా డేట్లు ఇచ్చే స్టార్‌ ఎవరో చెప్పండంటూ రాజమౌళి విద్యార్థులనే ప్రశ్నించారు.

  ఇక కొద్ది రోజుల క్రితం... డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి సృష్టించిన వండర్ బాహుబలి 100 రోజులకు దగ్గర అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఓ సంఘటన అందరినీ మరోసారి ఈ సనిమా గురించి గుర్తు చేసేలా చేసింది. రీసెంట్ గా ...తమిళనాడు వెల్లూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజిలో విద్యార్దులకు బాహుబలి ప్రశ్నలు ఇచ్చారు.

  వాళ్ళ ప్రస్నాపత్రాన్ని చూసి షాక్ అయ్యారు. బాహుబలి 2 కు చెందిన వార్ సీక్వెన్స్ కు చెందిన ఇంజనీరింగ్ సెట్స్ డిజైన్ చేయమని ఆ పేపరులో ఉంది. వాళ్లు డౌట్ తో తమ ప్రొఫిసర్ ని ఈ విషయమై ప్రశ్నించారు. ఆయన మీరు చూసింది కరక్టే అని ఖరారు చేసి చెప్పారు. రెండు ప్రశ్నలు..తలో పది మార్కులతో ఈ విషయమై ఉన్నాయి.

  చైనాలో 'బాహుబలి'

  ఇప్పుడు ఇతర దేశాల్లోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. చైనాలో 'బాహుబలి'ని 5000 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు చిత్రాన్ని ఎడిట్‌ చేశారు. పలు చలన చిత్రోత్సవాలకీ పంపుతున్నారు. చైనాలో ఈ చిత్రం నవంబరు నుంచి సందడి చేయబోతోంది. అక్కడ 'పీకే' చిత్రాన్ని విడుదల చేసిన ఈ స్టార్స్‌ ఫిలిమ్స్‌ సంస్థనే 'బాహుబలి'ని విడుదల చేస్తుండడం విశేషం.

  'పీకే'కి చైనాలో మంచి ఆదరణ లభించింది. అదే తరహాలో 'బాహుబలి' కూడా చైనా ప్రేక్షకుల్ని అలరిస్తుందని సినీ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించారు.

  English summary
  SS Rajamouli shared: "A curious elephant blesses a happy me!! ‪#‎BaahubaliMemories‬"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X