»   » కెమెరాకు చిక్కిన కుర్ర మెగా హీరోలు! (ఫోటో)

కెమెరాకు చిక్కిన కుర్ర మెగా హీరోలు! (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొణిదెల శివ శంకర వరప్రసాద్.....సినిమాలపై మక్కువతో మద్రాసులో అడుగు పెట్టి నానా కష్టాలు పడి సినిమాల్లో అవకాశం దక్కించు కోవడం. ఆపై తన టాలెంటు, స్వయం కృషితో ఒక స్థాయికి రావడం, హీరోగా మారిన తర్వాత తన స్క్రీన్ నేమ్ చిరంజీవిగా మార్చుకుని చిరస్థాయిగా...తిరుగులేని హీరోగా ఎదగడం, తెలుగు సినిమా పరిశ్రమకు మెగాస్టార్‌గా వెలిగి పోయి చక్రం తిప్పడం గతం. ప్రస్తుతం ఆయన తమ్మడు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ స్థానాన్ని బర్తీ చేసి తిరుగులేని హీరోగా ఏలుబడి సాగిస్తున్నారు.

కాలంతో పాటు చిరంజీవి కూడా మారి పోయారు. సినిమా రంగాన్ని వదిలి రాజకీయరంగంలో అడుగుపెట్టారు. చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుని మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్. ఈ కుర్ర మెగా హీరోలంతా ప్రస్తుతం ఇండస్ట్రీలో తమ సత్తా మేమిటో నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్ తెరంగ్రేటం చేసి సక్సెస్ అయ్యారు....వీరి దారిలోనే సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్ తదితరులు పరిశ్రమలో నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుర్రమెగా హీరోలంతా కలిసి దిగిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ నెట్వర్కింగులో హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి మరి....

New Generation Mega Stars
English summary
Mega Star Chiranjeevi is godfather for many star heroes who arrived from Mega Family. Chiranjeevi provided platform to the likes of Pawan Kalyan, Ram Charan, Allu Arjun etc. Now, Sai Dharam Tej, Varun Tej are more younger generation guys making their film debut from same family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu