స్విస్ వీధుల్లో ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తూ శ్రీదేవి (ఫోటోలు)
ముంబై : ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రీదేవి ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న శ్రీదేవి....అన్ని పనులను కాస్త పక్కనపెట్టి భర్త బోనీకపూర్, పిల్లలు జాన్వి, ఖుషీలతో కలిసి స్విస్ వీధుల్లో, పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ సేద తీరుతున్నారు.
త్వరలో శ్రీదేవి ప్రముఖ టెలివిజ్ షో ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాగా ప్రజాదరణ పొందిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' షో తెలుగు వెర్షన్ శ్రీదేవి ద్వారా ప్రారంభం కాబోతోందని అంటున్నారు. అయితే ఈ విషయం అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.
పెళ్లయి పిల్లు పుట్టాక సినిమాలకు పూర్తిగా దూరమైన శ్రీదేవి....దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తీసుకుని 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా ఇటీవల రీ ఎంట్రి ఇచ్చింది. ఇప్పటికే శ్రీదేవి అందం చెక్కు చెదరక పోవడంతో సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన గ్లామర్ ప్రదర్శిస్తోంది ఈ ప్రౌడ సుందరి.
ఇప్పటికే సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్)లో ఓ ఫ్రాంచైజీ సొంతం చేసుకుని సినిమా రంగంలో తన వ్యాపారాన్ని విస్తరిస్తున్న శ్రీదేవి...ఇక బుల్లితెరపై తన సత్తా చాటాలని నిర్ణయించుకుందని, అందులో భాగంగానే తెలుగులో 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

భర్త బోనీ కపూర్, కూతుర్లు జాన్వి కపూర్, ఖుషీ కపూర్ లతో కలిసి

భర్త బోనీకపూర్‌తో కలిసి స్విస్ వీధుల్లో శ్రీదేవి ఫోటోలకు ఇలా ఫోజిచ్చింది.


Click it and Unblock the Notifications











