నందమూరి అభిమానుల్ని అల్లాడిస్తోన్న అరుదైన ఫోటో

By Srikanya

హైదరాబాద్: నందమూరి అబిమానుల్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతూ ఓ ఫోటో సోషల్ నెటవర్కింగ్ సైట్స్ లో తెగ ప్రయాణిస్తోంది. ఆ అరుదైన ఫోటోలో బాలకృష్ణ, జయకృష్ణ, హరికృష్ణలతో పాటు వారి తండ్రి నందమూరి తారక రామారావు ఉన్నారు. ఇలా ముగ్గురు అన్నదమ్ముల్ని కలుపుతూ, ఎన్టీఆర్ ఉన్న ఫోటో సూపర్బ్ గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. దాంతో ఆ ఫోటోను ఒకరి నుంచి మరొకరు షేర్ చేసుకుంటున్నారు.

కొంతకాలంగా షూటింగులకు దూరంగా కాలం గడుపుతూ వస్తున్న నందమూరి బాలకృష్ణ త్వరలోనే ముఖానికి రంగేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్న సినిమా మే 15న సెట్స్ మీదకు వెళ్లనున్నది. ఆ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుంది. ఈ సినిమాకి 'రూలర్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఇదివరకు 'నమో వెంకటేశ', 'దూకుడు' వంటి చిత్రాల్ని నిర్మించి ప్రస్తుతం మహేశ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ సినిమాని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ, శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'సింహా' ఏ స్థాయి విజయాన్ని చవిచూసిందో తెలిసిందే. 'రూలర్' కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో బాలయ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా 'రూలర్' ఉండబోతోందని సమాచారం. బోయపాటి శ్రీను ఇప్పటికే ఓ పవర్ ఫుల్ కథను తయారు చేశారని చెప్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ కార్యకర్తలకు, ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చేందుకు ఈ చిత్రం ఉపయోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.

ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ ప్రిప్రొడక్షన్‌ పనులలో ఉంది. గతంలో వచ్చిన 'సింహా' చిత్రం భారీ విజయం సాధించింది. మరోసారి బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించేందుకు రంగం సిద్ధమైంది. బాలకృష్ణ చివరగా నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రం ఆ మధ్యన మంచి అంచనాలతో విడుదలై ప్లాప్ అయ్యింది. మరో ప్రక్క బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'దమ్ము' చిత్రం డివైడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. 'శ్రీమన్నారాయణ' తర్వాత ఏ సినిమాకూ బాలయ్య పచ్చజెండా ఊపలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X