ఫోటో: రవితేజతో కరీనా కపూర్
హైదరాబాద్: ఇటీవలే సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడిన బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ హీరోయిన్ కరీనా కపూర్ పెళ్లి తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వచ్చారు. భాగ్యనగరంలో జరిగిన కొన్ని పబ్లిక్ పంక్షన్లలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీనా కపూర్ టాలీవుడ్ స్టార్స్ రవితేజ, చార్మి, ప్రకాష్ రాజ్ లతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
వచ్చే నెలలో క్రిస్ మస్ వేడుకలు ఉన్న నేపథ్యంలో.... పలు స్టార్ హోటళ్లు క్రిస్ మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టాయి. ఇలాంటి వేడుకలకు సెలబ్రిటీలను ఆహ్వానించడం ఈ మధ్య ఆనవాయితీగా మారింది. అందులో భాగంగానే కరీనాకు ఆహ్వానం అందడంతో ఆమె ఇక్కడకు వచ్చారు.
కరీనా సినిమాల విషయానికొస్తే...
కరీనా ప్రస్తుతం 'తలాష్' చిత్రం రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ బాలీవుడ్ చిత్రం నవంబర్ 30 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. మరో వైపు ఆమె కరీనా కపూర్ ఐటం సాంగ్ చేసిన దబాంగ్ 2 చిత్రం క్రిస్ మస్ సీజన్ ను పురస్కరించుకుని విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











