twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ‘అత్తారింటికి దారేది’ భారీ హౌస్ సెట్ ‌(ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం భారీ హౌస్ సెట్ వేసారు. ఆ సెట్‌కు సంబంధించిన ఫోటోను ఇక్కడ వీక్షించవచ్చు. ఈ సెట్లో సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

    అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7వ తేదీన విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    గతంలో పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో 'జల్సా' చిత్రం వచ్చిన నేపథ్యంలో 'అత్తారింటికి దారేది' చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తున్నారని స్పష్టం అవుతోంది.

    ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మన్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    పవన్ ‘అత్తారింటికి దారేది’ భారీ హౌస్ సెట్ ‌(ఫోటో)

    అత్తారింటికి దారేది చిత్రం కోసం వేసిన భారీ ఇంటి సెట్

    పవన్ ‘అత్తారింటికి దారేది’ భారీ హౌస్ సెట్ ‌(ఫోటో)

    పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫోటో...

    English summary
    
 Check out the house set being used for Power Star Pawan Kalyan’s upcoming movie ‘Attarintiki Dhaaredhi’. The film will hit the screens on August 7th. Producer BVSN Prasad confirmed this news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X