»   »  భార్యతో, స్టార్ హీరోయిన్ తో ఒకేసారి మెగా హీరో(ఫొటో)

భార్యతో, స్టార్ హీరోయిన్ తో ఒకేసారి మెగా హీరో(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తన భార్య ఉపాసన , టాలీవుడ్ గోల్డెన్ హీరోయిన్ గా మారిన శృతి హాసన్ లతో కలిసి ఇలా ఫోజ్ ఇచ్చారు. రీసెంట్ గా మెగా కపుల్ ని సర్ఫైజ్ గా కలిసింది శృతి. హైదరబాద్ లో ఉన్న ఆమె రకరకాల కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నా ఇలా ఈ దంపతులను కలిసింది. ఆ సందర్బంలో ఇదిగో ఇలా ఫోజిచ్చారు మెగా దంపతులు. ఉపాసన సైతం తన భర్తతో చేసే హీరోయిన్స్ తో కలిసి పోయి చాలా చనువుగా ఉంటూంటుంది. శృతి హాసన్ గతంలో రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రంలో చేసింది. అలాగే ...అల్లు అర్జున్ సరసన రీసెంట్ గా రేసు గుర్రం చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే...

రామ్ చరణ్ ఇంకోటి కమిటయ్యారని సమాచారం. శ్రీను వైట్ల చిత్రం హడావిడిలో ఉన్న రామ్ చరణ్ ... రేసుగుర్రం వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు సురేందర్‌రెడ్డితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ మేరకు టాక్స్ జరిగినట్లు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు రామ్‌చరణ్‌ని కలిసి సురేందర్‌రెడ్డి కథ కూడా వినిపించినట్లు చెప్పుకుంటున్నారు. పూర్తి స్దాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. దానికి సైతం వక్కంతం వంశీ కథ అందిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో బయటకొచ్చే అవకాశం ఉంది.

Photo: Ram Charan with Wife & Star Heroine

ప్రస్తుతం చరణ్‌, శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి రెగ్యూలర్‌ షూటింగ్‌ జనవరి 28 నుంచి ప్రారంభిస్తారని చిత్ర యూనిట్‌ తెలిపారు. చరణ్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో సమంతాను హీరోయిన్ న్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం అనంతరం సురేంద్రరెడ్డితో చిత్రం ఉంటుంది.

ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఫిలింనగర్‌ వర్గాల నుండి సమాచారం. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని ‘మన భారతంలో పాండవులు, కౌరవులు రాజాలు రా' అనే సాంగ్ నుండి ఈ మూవీ టైటిల్ స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్ పరిశీలిస్తారా? అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ చిత్రం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.

ప్రస్తుతం సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ....రవితేజ హీరోగా కిక్‌-2 రూపొందుతుంది. ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే చిత్రాలెప్పుడూ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటాయి. రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన 'కిక్' అలాంటి విజయాన్నే సొంతం చేసుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం మొదలైంది. 'కిక్ 2' పేరుతో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థపై కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆ మధ్యన హైదరాబాద్‌లో జరిగింది. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. ఈ సంవత్సరం మార్చి 28న చిత్రాన్ని విడుదల చేస్తామని కల్యాణ్‌రామ్ అన్నారు.

English summary
Sruthi hassan surprised Mega couple by paying a surprise visit. Above pic shows the close chemistry of Charan with Upsi and Shruti.
Please Wait while comments are loading...