‘సెక్స్ అండ్ డెమన్’ చిత్రం కోసం హాట్ ఫోజులు (ఫోటోలు)
ముంబై: ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సరికొత్త కాన్సెప్టు సినిమాల జోరు ఊపందుకుంది. సెక్స్, హారర్ కథాంశంతో కూడిన సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఇలాంటి కథాంశంతో ఆ మధ్య వచ్చిన 'రాగిణి ఎంఎంఎస్' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యం తాజాగా దానికి సీక్వెల్‌గా 'రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆ తరహా ఎలిమెంట్స్‌తో మరో సినిమా తెరకెక్కబోతోంది. ఆ చిత్రం పేరు 'సెక్స్ అండ్ డెమన్'. 'సెక్స్ అండ్ డెమన్' అంటే తెలుగులో 'శృంగారం మరియు దెయ్యం' అని అర్థం. ఈ చిత్రానికి అభిషేక్ జవకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే అతడి తొలి చిత్రం. సినిమాకు పబ్లిసిటీ కల్పించడంలో భాగంగా ఈచిత్రంలో నటిస్తున్న ముగ్గుకు హాట్ అండ్ సెక్సీ బ్యూటీస్ సైమిరా రావు, జ్యోతి సేథి, ఆరాధ్య కపూర్‌లపై ఫోటో షూట్ జరిపారు.
ఫోటో షూట్‌ను మీడియాకు విడుదల చేయడంతో పాటు సినిమా వివరాలను దర్శకుడు వెల్లడించారు. అందుకు సంబంధించిన వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో....

సెక్స్ అండ్ డెమన్ చిత్రం విశేషాలు
సెక్స్ అండ్ డెమన్ చిత్రానికి అభిషేక్ జవకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రెనౌడ్ ఇన్‌క్రాప్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. నకాష్ అజీజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

అభిషేక్ జవకర్ ఇంతకు ముందు యాడ్ ఫిల్మ్ డైరెక్టర్
అభిషేక్ జవకర్ ఇంతకు ముందు ఫాక్స్ ఛానల్‌లో యాడ్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పని చేసారు. 2005 నుండి ఆయన ఈ ఫీల్డులో ఉన్నారు. స్ర్కిప్టు రైటర్‌గా కూడా అనుభవం ఉంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్‌గా పని చేసారు.

సినిమా స్టోరీ గురించి చెబుతూ...
ముగ్గురు పెళ్లికాని స్త్రీలు పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. మేల్ ఎస్కార్ట్స్ (మగ వ్యభిచారులు)ను తీసుకుని ఫారెస్టులో ఉండే గెస్ట్ హౌస్‌కు వెళతారు. అక్కడ జరిగే పరిణామాలు ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేస్తాయి అని దర్శకుడు తెలిపారు.

హారర్ అండ్ సెక్స్
ఈ సినిమా ప్రేక్షకులను భయబ్రాంతులకు గురి చేసే హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ఆడియన్స్‌ను సమ్మోహన పరిచే శృంగార భరితమైన సన్నివేశాలతో ప్లాన్ చేస్తున్నారు.

ముగ్గురు హాట్ బ్యూటీలు
ఈ చిత్రంలో హాట్ అండ్ సెక్సీ మెడల్స్ సైమిరా రావు, జ్యోతి సేథి, ఆరాధ్య కపూర్ నటిస్తున్నారు. వీరు కేవలం మొడల్స్ మాత్రమే కాకుండా పలు టీవీ షోలు, పంజాబి, సౌత్ ఫిల్మ్స్‌లో నటించిన అనుభవం ఉంది.

సినిమాపై నమ్మకం...
ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని, హారర్, సెక్స్ ఎలిమెంట్స్ కోరుకునే ప్రేక్షకులు కూడా థ్రిల్లయ్యే విధంగా ఉంటుందని ఫిల్మ్ మేకర్స్ అంటున్నారు.

షూటింగ్ ఎప్పటి నుండి?
ఈ చిత్రం షూటింగ్ మార్చి 2, 2014 నుండి మొదలు పెట్టనున్నట్లు దర్శకుడు అభిషేక్ జవకర్ తెలిపారు. ముంబై-గోవా హైవే మధ్యలో ఉండే ప్రాంతాల్లో షూటింగ్ జరుపనున్నట్లు తెలిపారు.

విడుదల ఎప్పుడు?
సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తామనే నమ్మకతో ఉన్నారు దర్శకుడు అభిషేక్ జవకర్. ఈచిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications