రాజమౌళి రహస్యం లీక్ చేసారు(ఫొటో)
హైదరాబాద్ : మనందరికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడిగానే తెలుసు. కానీ ఆయన నటుడు కూడా. కేవలం కెమెరా వెనుకే ఆయన ప్రతిభాశీలి మాత్రమే కాదు... ఆయన కెమెరా ముందూ నటించారు. దర్శకుడు కాకముందు ఆయన చిన్నతనంలో ఓ చిత్రంలో నటించారు. ఆ ఫొటోనే మీరు ప్రక్కన చూస్తున్నది.
ఇంతకీ ఆయన పోషించిన పాత్ర ఏంటంటే చిన్నికృష్ణుడు. ఇప్పటి వరకు తెలియని ఈ రహస్యాన్ని ఆయనే స్వయంగా ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ''నా చిన్న వయసులో కృష్ణుడి పాత్రలో నటించాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పూర్తి కాలేదు'' అని చెప్పారు. కృష్ణాష్టమి సందర్భంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు రాజమౌళి.
ఆయన సినిమాల విషయానికి వస్తే...
ప్రముఖ దర్శకుడు రాజమౌళి...భారీ స్ధాయిలో బాహుబలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. రానా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ జోరుగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.

ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకుని తమ ప్రతిభను చూపిస్తున్నారు.రమ్యకృష్ణ నెగిటివ్ రోల్ లో బాహుబలి చిత్రంలో కనపించనుంది. అన్నదమ్ములుగా రానా, ప్రభాస్ కనిపిస్తారు. రాజ్యంకోసం జరిగే కుట్రలతో ఈ చిత్రం సాగుతుంది.
షూటింగ్ కు ముందు నుంచి ఈ చిత్రం రోజుకో వార్తతో రికార్డు క్రియోట్ చేస్తోంది. ప్రభాస్ గెటప్ దగ్గరనుంచి ఈ చిత్రంలో ప్రతీదీ సంచలనమే. ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యారీ ఎలెక్సా ఎక్స్.టి. కెమెరాని వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు కేరళ, తమిళనాడు, రాజస్థాన్‌లలో చిత్రీకరణ జరుగేటట్లు ప్లాన్ చేసారు.
ఇక ఈ చిత్రం కథ అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరుగా తీర్చి దిద్దుతున్నారని తెలుస్తోంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











