ఫోటో : సమంత బెడ్రూంలో దర్శకుడు త్రివిక్రమ్
హైదరాబాద్ : దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్....హీరోయిన్ సమంత బెడ్రూంలో ఉన్న ఫోటో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అయితే ఇందులో తప్పుగా భావించాల్సిందేమీ లేదు. 'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగులో భాగంగా బెడ్రూంలో జరిగే ఓ సన్నివేశం గురించి దర్శకుడు త్రివిక్రమ్ సమంతకు వివరిస్తున్న దృశ్యం మాత్రమే ఇది.
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'అత్తారింటికి దారేది' చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఈ చిత్రం ఆడియో ఆల్బం విడుదల కార్యక్రమం ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగుబోతోంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వేడుక జరుగుతోందని, ఆడియో పాసులు అందరి అభిమానులు నిరాశ చెందవద్దని, తమ పరిస్థితి అర్థం చేసుకోవాలని, ఆడియో విడుదల కార్యక్రమాన్ని టీవీల్లో వీక్షించాలని నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కోరారు.
ఆగస్టు 7న సినిమా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











