షాడో కాంబినేషన్: USA లో వెంకటేష్, తాప్సీ ఇలా (ఫొటో)
హైదరాబాద్ : నార్త్ అమెరికా తెలుగు సంఘం(NATS) తెలుగు సంబరాలు పోగ్రాంకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. జూలై 2 నుంచి 4 వ తేదీ వరకూ ఈ సంబరాలు జరగనున్నాయి. ఈ సంబరాలుకు ఛీఫ్ గెస్ట్ గా వెంకటేష్, ఆయన సోదరుడు సురేష్ బాబు హాజరయ్యారు. ఈ ఫొటోలో వీరిద్దరినీ చూడవచ్చు. వెంకటేష్ ప్రక్కన...తాప్సీ కూర్చుని ఉన్నాడు. తాప్సీ, వెంకటేష్ కాంబినేషన్ లో గతంలో షాడో చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక యుఎస్ లోని రెండు జాతీయ స్థాయి ప్రవాస తెలుగు సంఘాలు.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర అమెరికా తెలుగు సొసెటీ (నాట్స్) తమ ద్వైవార్షిక మహాసభలను గురు, శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తున్నాయి. గురువారం సాయంత్రం విందు కార్యక్రమంతో రెండు చోట్లా వేడుకలు మొదలయ్యాయి.
ఈ తానా 20వ మహాసభలను డెట్రాయిట్‌లోని కోబో సెంటర్‌లో సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్, అధ్యక్షుడు నన్నపనేని మోహన్ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. అలాగే..... నాట్స్ 4వ మహాసభలు లాస్‌ఏంజెలెస్‌లోని అనహేం కన్వెన్షన్ సెంటర్‌లో సమన్వయకర్త ఆలపాటి రవి నేతృత్వంలో జరుగుతున్నాయి.

ఇక నాట్స్ సంబరాల్లో .. నందమూరి బాలకృష్ణ, గ్రంథి మల్లికార్జున రావు, పీపీ రెడ్డి, జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు, జస్టిస్ శేషసాయి, నిమ్మగడ్డ ప్రసాద్, త్రిష, కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్, విమలా రామన్, కమలిని ముఖర్జీ, అనూప్ రూబెన్స్, వందేమాతరం, సిరాశ్రీ, గజల్ శ్రీనివాస్ పాల్గొంటున్నారు.
అలాగే... తనికెళ్ల భరణి, గీతామాధురి, భాస్కరభట్ల, ఎమ్మెల్యే ఆలపాటి రాజా, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఇప్పటికే చేరుకున్నారు.
ఇక , తానా ప్రారంభోత్సవంలో పాల్గొనే అతిథులు నాట్స్ ముగింపు వేడుకలకు, నాట్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనే ప్రముఖులు తానా ముగింపు ఉత్సవాలకు హాజరయ్యేలా, రెండు సభలకూ హాజరయ్యే తెలుగువారందరితో సమావేశమయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవటం విశేషం.


Click it and Unblock the Notifications











