ఫిల్మ్ ఫేర్ పంక్షన్ లో మన స్టార్స్ ఇలా... (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: 60వ దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో కన్నులపండువగా జరిగింది. దక్షిణాదికి చెందిన అగ్ర సినీ తారలందరూ ఈ వేడుకకు తరలివచ్చారు. ఎక్కడ చూసినా సినిమావారితో గ్లామర్ ..పొంగిపొరిలింది. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా 'ఈగ', 'గబ్బర్‌సింగ్' చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా పవన్‌కల్యాణ్, 'ఈగ' చిత్రానికి ఉత్తమ నటిగా సమంతా అవార్డులను స్వీకరించారు.
యస్.యస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఈగ' నాలుగు విభాగాల్లో అవార్డులను సాధించి అగ్రభాగంలో నిలిచింది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటుడు విభాగాల్లో 'ఈగ' అవార్డులను కైవసం చేసుకుంది. పవన్‌కల్యాణ్ తరపున రామ్‌చరణ్ ఉత్తమ నటుడు అవార్డును స్వీకరించారు. సుప్రసిద్ధ దర్శకుడు బాపు, ప్రముఖ గాయని వాణి జయరామ్ జీవన సాఫల్య పురస్కారాలను అందుకున్నారు.
టాప్ అవార్డ్స్ ని ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన "ఈగ", పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "గబ్బర్ సింగ్" సినిమాలు కైవసం చేసుకున్నాయి. 60 వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో ఈగ, గబ్బర్ సింగ్, బిజినెస్ మాన్, జులాయి, రచ్చ, ఇష్క్, ఢమరుకం సినిమాలు కూడా పలు విభాగాల్లో నామినేట్ అవ్వగా అన్నిటి కంటే ఎక్కువ మరియు కీలకమైన అవార్డ్స్ ని ఈగ, గబ్బర్ సింగ్ సినిమాలు దక్కించుకున్నాయి.
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకి గాను బెస్ట్ హీరో అవార్డు సొంతం చేసుకున్నారు, అలాగే గబ్బర్ సింగ్ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్(దేవీశ్రీ ప్రసాద్), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (వడ్డేపల్లి శ్రీనివాస్) అవార్డ్స్ వచ్చాయి. రామ్ చరణ్ అవార్డు అందుకున్నాడు. ఈగ చిత్రానికి గాను ఎస్ ఎస్ రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నారు, అలాగే ఈగ మూవీకి ఉత్తమ చిత్రం, బెస్ట్ హీరోయిన్ (సమంత), ఉత్తమ సహాయ నటుడు (సుదీప్), బెస్ట్ విఎఫ్ఎక్స్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
మన స్టార్స్ అవార్డు పంక్షన్ లో మెరిసి క్షణాలు....

సమంత
బెస్ట్ అవార్డు అందుకున్న చాలా ఎక్సైట్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ.. "ఫిల్మ్ ఫేర్ ఎప్పుడూ నిజమైన టాలెంట్ ని గుర్తిస్తుంది. ఈ అవార్డు అందుకోవటం చాలా సంతోషకరం ." అంటూ చాలా ఆనందంగా చెప్పుకొచ్చింది. వరస ఆఫర్స్ తో బిజీగా ఉన్న ఆమెకు ఈ అవార్డు రావటం పట్ల ఇండస్ట్రీ కూడా చాలా సంతోషించింది.

నాగార్జున,నాగచైతన్య
ఢమురకం చిత్రానికి బెస్ట్ యాక్టర్ గా ఎంపికైన నాగార్జున తన కుమారుడు నాగచైతన్య తో కలిసి ఎంపికయ్యారు. అంతేకాదు ఆయన సతీమణి అమల..కి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రానికి గానూ... బెస్ట్ సపోర్టింగ్ నటిగా ఎంపికైంది. శేఖర్ కమ్మలు దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది.

రామ్ చరణ్ తేజ
రచ్చ చిత్రానికి గానూ...రామ్ చరణ్ తేజ బెస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యారు. ఆయన తన భార్యతో కలిసి ఈ పంక్షన్ కి వచ్చారు. పవన్ కళ్యాణ్ తరుపున ఆయన అవార్డుని స్వీకరించారు. రామ్ చరణ్ తాజా చిత్రం ఎవడు ఈ నెల్లో విడుదల కాబోతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

రానా దగ్గుబాటి
కృష్ణ వందే జగద్గురం చిత్రం కొన్ని కేటగిరీస్ లో అవార్డులు ఖచ్చితంగా వస్తాయని రానా ఆశించారు. కానీ .. ఆయన్ని చాలా డిజప్పాయింట్ చేసింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం క్రిటికల్ గా పేరు తెచ్చిపెట్టింది కానీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. కానీ రానా లోని నటుడుని మాత్రం ఎలివేట్ చేసింది.

దేవిశ్రీ ప్రసాద్
గబ్బర్ సింగ్ కి బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ అవార్డు సాధించిన దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు తెలుగు పరిశ్రమలో హాట్ ఫేవరెట్. అందులోనూ పవన్ తాజా చిత్రం అత్తారింటింకి దారేది చిత్రం చేస్తున్నారు. ఆయన ట్యూన్ చేసిన పాటలు ఇప్పుడు ఎక్కడ విన్నా వినపడుతున్నాయి. ఆ ఉత్సాహంలో ఉన్నారు దేవిశ్రీ ప్రసాద్.

బాబా సెహగల్
ఈ బాలీవుడ్ గాయికుడుకి తెలుగులో మంచి డిమాండ్. పవన్ కళ్యాణ్ చిత్రాలుకు తప్పకుండా ఆయన పాట ఉండి తీరాల్సిందే అన్నట్లుగా తయారైంది. ఆయన భార్యతో కలిసి ఈ పంక్షన్ కి అటెండయ్యారు. ఆయనకు ఉన్న మంచి ర్యాపోతో అందిరూ ఆయన్ని పలకరించి...హత్తుకున్నారు.

ప్రియమణి
చారులత చిత్రంతో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న ప్రియమణి వరస ఫెయిల్యూర్స్ లో ఉన్నా ఈ అవార్డుతో ఆమెకు ఉత్సాహం వచ్చినట్లైంది. నటనతో మరిపించే ఆమెకు సరైన పాత్ర ఇంకా రాలేదంటోంది. ఆమె తమిళంలో గతంలో అవార్డులు అనేకం పొందింది.

ఛార్మి
బ్లాక్ గౌన్ లో చాలా హాట్ గా వచ్చిన ఛార్మి అక్కడున్న అందరి దృష్టినీ ఆకర్షించింది. ఛార్మి కి తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా తనేంటో ప్రూవ్ చేసుకోవటంతో టాలీవుడ్ లో ఆమెకు మంచి గౌరవం ఉంది. అందరు హీరోలు ఆమెను ఆత్మీయంగా పలకరించారు. ఛార్మి అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రెజినా
'ఎస్.ఎమ్.ఎస్', చిత్రంతో పరిచయమైన రెజీనా ఈ ఫంక్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా మెరిసింది. తాజాగా ఆమె మరో కొత్త చిత్రంలో ఎంపికైంది. చిరంజీవి మేనల్లుడు సాయిధర్మతేజ్ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రెజీనాను ఎంపిక చేశారు. రీసెంట్ గా 'రొటీన్ లవ్‌స్టోరీ' చిత్రాల్లో నటించిందీ భామ. అలాగే హరీష్ శంకర్ ,ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసారని సమాచారం.

భూమిక
ఖుషీ చిత్రం గుర్తుంన్నత కాలం భూమిక గుర్తుండే ఉంటుంది. ఆమె ఈ పంక్షన్ కి వచ్చి తన మిత్రులందరినీ కలిసింది. ఖుషి చిత్రంతో యూత్ గుండెల్లో తిష్ట వేసుకున్న భూమిక ఆ తర్వాత వివాహం చేసుకుని సినిమాలు తగ్గించుకుంది. అయితే వివాహం అయ్యాక ఆమెకు సినిమా ఆఫర్స్ రావటం లేకే తగ్గించుకున్నారా అంటే కాదని అంటోంది. తాను ఎక్కువ సినిమాలు ఒప్పుకోకపోవటానికి కారణం...ప్రస్తుతం తెలుగులో హీరోయిన్స్ అంటే స్కిన్ షో,డబుల్ మీనింగ్ డైలాగులకే పరిమితం అవుతున్నాయని అందుకే అలాంటి పాత్రలకు తాను దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

కృతి కర్భందా
రీసెంట్ గా ఓం 3డిలో మెరిసన ఈ భామ ఈ పంక్షన్ లో మెరిసింది. 'బోణి'తో తెలుగు తెరకు పరిచయమైన ఆమెకు ఆ సినిమా ఫెయిల్యూర్ కావటంతో ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు.రీసెంట్ గా 'అలా మొదలైంది' చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 'తీన్‌మార్'లో పవన్ కల్యాణ్ సరసన నటించింది. వసుమతి పాత్రలో లంగాఓణీతో సంప్రదాయబద్ధంగా కనిపించింది. ఒంగోలు గిత్త, ఓం చిత్రాలు ఆమెను నిరాశపరిచాయి.

శృతి,అక్షర హాసన్
కమల్ హాసన్ ఇద్దరు కూతుళ్లూ ఈ పంక్షన్ కి హాజరయ్యారు. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ తో శృతి స్టార్ హీరోయిన్ అయ్యిపోయింది. ఆమె తాజాగా చేసిన ఎవడు రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. రీసెంట్ గా హిందీలో ఆమె చేసిన రామయ్య వస్తావయ్యా, డి డే చిత్రాలు రెండూ మంచి విజయం సాధించాయి.


Click it and Unblock the Notifications











