»   » ఘనంగా హీరోయిన్ స్నేహ సీమంతం (ఫోటోస్)

ఘనంగా హీరోయిన్ స్నేహ సీమంతం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ స్నేహ గర్భం ధరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయాన్ని స్నేహ భర్త ప్రసన్న ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ....తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ వేడుక ఫోటోలను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘‘ తక్కువ సమయం ఉండటం వల్ల ఈ వేడుకకు అందర్నీ ఆహ్వానించలేకపోయినందుకు మమ్మల్ని క్షమించాలి. మీ ఆశీస్సులు మాకు తప్పకుండా ఉంటాయని తెలుసు'' అని స్నేహ కూడా ట్విట్ చేసింది.

వెంకీ, రాధా గోపాళం, శ్రీరామదాసు, రాజన్న, ఉలవ చారు చిత్రాల ఫేం స్నేహ తన సహ నటుడు ప్రసన్నను పెళ్లాడిన సంగతి తెలిసిందే. స్నేహ వివాహం తమిళ నటుడు ప్రసన్నతో 2012 మే 11న జరిగిన సంగతి తెలిసిందే. 'అచ్చముండు అచ్చముండు' చిత్రం ద్వారా నటుడు ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, పెళ్లి ద్వారా ఓ ఇంటివారయ్యారు స్నేహ-ప్రసన్న దంపతులు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో ఈ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా స్నేహ తన నట జీవితాన్ని కొనసాగిస్తూ వస్తోంది.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రసన్న మాట్లాడుతూ...పెళ్లయిన తర్వాత స్నేహ సినిమాల్లో కొనసాగడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఆరునెలలు పోరాడి పెళ్లికి పెద్దలను ఒప్పించామని ప్రసన్న చెప్పారు. ప్రస్తుతం స్నేహ-ప్రసన్న దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. తెలుగులో ఆమె నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చిన నేపథ్యంలో సినిమాలకు కొన్నేళ్ల పాటు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.

స్లైడ్ షోలో సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు..

సమంతం
  

సమంతం

సీమంతం వేడుకలో భర్త ప్రసన్నతో కలిసి నటి స్నేహ.

స్నేహ
  

స్నేహ

ప్రతి మహిళకు తల్లికావడం కంటే మించిన ఆనందం మరొకటి ఉండదు. ప్రస్తుతం స్నేహ కూడా చాలా ఆనందంగా ఉంది.

స్నేహితులతో..
  

స్నేహితులతో..

స్నేహితులతో కలిసి సెల్ఫీ...

స్నేహ ట్వీట్
  

స్నేహ ట్వీట్

తక్కువ సమయం ఉండటం వల్ల ఈ వేడుకకు అందర్నీ ఆహ్వానించలేకపోయినందుకు మమ్మల్ని క్షమించాలి. మీ ఆశీస్సులు మాకు తప్పకుండా ఉంటాయని తెలుసు'' అని స్నేహ కూడా ట్విట్ చేసింది.

Please Wait while comments are loading...