»   » సోదరుడి వివాహం: సన్నీ లియోన్‌ని ఇలా ఎప్పుడూ చూడలేదు (ఫోటోస్)

సోదరుడి వివాహం: సన్నీ లియోన్‌ని ఇలా ఎప్పుడూ చూడలేదు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సన్నీ లియోన్....పేరు వినగానే అందరి ఊహల్లోకి వచ్చేది బికినీ వేసుకున్న అందమైన రూపం లేదా హాట్ అండ్ సెక్సీ లుక్‌లో కళ్లముందు మెదలినట్లు అనిపించే మత్తెక్కించే పరువాలు! బాలీవుడ్లో ఒకప్పటి సెక్స్ సింబల్ బ్యూటీలందరినీ వెనక్కినెట్టి తన హవా కొనసాగిస్తోన్న సన్నీ లియోన్.... ఇటీవల తన సోదరుడి వివాహ వేడుకలో సిక్కు సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది.

సన్నీ లియెన్ భారత సంతతికి చెందిన సిక్కు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. సన్నీ అసలు పేరు కరన్జీత్ కౌర్ వోహ్రా. పోర్న్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును సన్నీ లియోన్ గా మార్చుకుంది. సన్నీ లియోన్ కు సందీప్ వోహ్రా అనే సోదరుడు ఉన్నాడు. ఇటీవల సందీప్ వోహ్రా వివాహం తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ కరిష్మా నాయుడుతో జరిగింది.

పంజాబి సాంప్రదాయ దుస్తుల్లో సన్నీ లియోన్

పంజాబి సాంప్రదాయ దుస్తుల్లో సన్నీ లియోన్

సిక్కు సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకలో సన్నీ లియోన్ పంజాబీ మహిళలు ధరించే సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు. యూఎస్ఏలోని గురుద్వారలో ఈ పెళ్లి వేడుక జరిగింది.

సందీప్ వోహ్రా

సందీప్ వోహ్రా

సన్నీ లియోన్ సోదరుడు సందీప్ వోహ్రా అమెరికాలో చెఫ్ గా పని చేస్తున్నాడు. స్టైలిస్ట్ కరిష్మా నాయుడుతో సందీప్ వోహ్రా ప్రేమాయణం సాగిస్తున్నాడు. సిక్కు సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

సన్నీ-డేనియల్ పెళ్లి పెద్దలు

సన్నీ-డేనియల్ పెళ్లి పెద్దలు

సందీప్, కరిష్మా వివాహానికి సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ పెళ్లి పెద్దలుగా మారారు. ఇద్దరూ సిక్కు సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సన్నీతో పాటు ఇండియాలో

సన్నీతో పాటు ఇండియాలో

బాలీవుడ్లో అడుగు పెట్టిన తర్వాత సన్నీ లియోన్ దశ తిరిగిందనే చెప్పాలి. బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెలుతున్న ఆమె...ఇక్కడ పలు వ్యాపారాలు కూడా ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వ్యవహారాలు ఆమె భర్త డేనియాల్ వెబర్ తో పాటు..... సందీప్, కరిష్మాలు చూసుకుంటున్నారు.

సందీప్-కరిష్మా నాయుడు

సందీప్-కరిష్మా నాయుడు

సందీప్ వోహ్రా, కరిష్మా నాయుడు గత ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. కరిష్మా నాయుడు కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో ఇద్దరూ త్వరగా దగ్గరయ్యారు.

సోదరుడిని ముస్తాబు చేస్తూ

సోదరుడిని ముస్తాబు చేస్తూ

పెళ్లి వేడుక సందర్భంగా సోదరుడు సందీప్ వోహ్రాను ముస్తాబు చేస్తూ.....సన్నీ లియోన్.

అత్త మామలు

అత్త మామలు

సన్నీ లియోన్ భర్త డేనియర్ వెబర్ తల్లిదండ్రులు కూడా ఈ వేడుకకు ఇండియన్ సాంప్రదాయ దుస్తుల్లో హాజరు కావడం గమనార్హం.

వెడ్డింగ్ పార్టీ

వెడ్డింగ్ పార్టీ

సందీప్ వోహ్రా వెడ్డింగ్ పార్టీలో సన్నీ లియోన్-డేనియర్ వెబర్ ఫ్యామిలీ.

భర్తతో కలిసి

భర్తతో కలిసి

సన్నీ లియోన్, డేనియల్ వెబర్ మధ్య పోర్న్ ఇండస్ట్రీలోనే పరిచయం అయింది. అప్పుడే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సొంతగా కొన్ని పోర్న్ సినిమాలు నిర్మించారు. సన్నీ లియోన్ ఇండియా వచ్చిన తర్వాత డేనియల్ సన్నీలియోన్ కు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు.

English summary
Sunny Leone's brother Sundeep Vohra recently got married to his longtime girlfriend, Karishma Naidu in a traditional sikh ceremony at a Gurudwara in US.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu