ఐశ్వర్యరాయ్ కూతురు రియల్ ఫోటో ఇదే...
ముంబై : అందాల తార ఐశ్వర్య రాయ్ గత సంవత్సరం నవంబర్ 16న ఆరాధ్యకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఐశ్వర్య బేబీ ఫోటో బయటకు రాలేదు. ఆ మధ్య ఇంటర్నెట్ లో, ఫేస్ బుక్ లో మాత్రం ఇదే ఐశ్వర్య బేబీ ఫోటో అంటూ కొన్ని ఫోటోలు దర్శనం ఇవ్వగా బచ్చన్ కుటుంబ సభ్యులు అవన్నీ నకిలీవే అని తేల్చి పారేసారు.
అయితే ఎట్టకేలకు ఐశ్వర్య రాయ్ కూతురు రియల్ ఫోటో బయటకు వచ్చింది. ఇటీవల ఐశ్వర్య కూతురు ఆరాధ్యతో ముంబై ఎయిర్ పోర్టుకు రాగా ఫోటోగ్రాఫర్లు ఆరాధ్యను కెమెరాల్లో బంధించారు. ఐశ్వర్య కూతురి తొలి ఫోటోను ఓ హిందీ అంతర్జాలం బయటకు విడుదల చేయగా...తాజాగా చాలా వెబ్ సైట్లు, పత్రికల్లో దర్శనం ఇచ్చింది.
అభిషేక్ బచ్చన్ ధూమ్-3 చిత్రీకరణలో భాగంగా కొన్ని రోజులుగా అమెరికాలోని చికాగోలో మకాం వేయాల్సి వచ్చింది. దీంతో అక్కడే అద్దె ఇల్లు తీసుకుని ఐశ్వర్యతో పాటు కూతురు ఆరాధనను తీసుకుని అక్కడికి షిప్ట్ అయ్యారు. అందులో భాగంగా ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి చికాగో వెలుతుండగా ముంబై ఎయిర్ పోర్టులో ఫోటోగ్రాఫర్స్ కెమెరాలకు చిక్కారు. బిడ్డ పుట్టిన తర్వాత లావయిన ఐశ్వర్య మళ్లీ స్టన్నింగ్ లుక్, అదిరిపోయే అందం, హీరోయిన్ లుక్ తో కనిపించడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
bollywood abhishek bachchan aishwarya rai dhoom 3 aamir khan బాలీవుడ్ అభిషేక్ బచ్చన్ ధూమ్ 3 అమీర్ ఖాన్


Click it and Unblock the Notifications
