»   » ఐశ్వర్యరాయ్ హాట్ లుక్, ఒక మంచి పని కోసం... (ఫోటోలు)

ఐశ్వర్యరాయ్ హాట్ లుక్, ఒక మంచి పని కోసం... (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఆదివారం చెన్నైలో హాట్ హాట్ లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులకు కనువిందు చేసారు. ఆమె ఇక్కడికి వచ్చింది ఒక మంచి పనిలో పాల్గొనడానికి. స్టెమ్ సెల్ బ్యాకింగ్ అవగాహనపై నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అప్పుడే పుట్టిన బిడ్డ బొడ్డు పేగు నుండి మూల కణాలను వేరు చేసి భద్రపర్చటమే 'స్టెమ్ సెల్ బ్యాంకింగ్'. స్టెమ్ సెల్స్ అంటే ఒక రకంగా తల్లి కణాలే. మామూలు కణాలతో పోలిస్తే ఇవి చాలా ప్రత్యేక కణాలు. భవిష్యత్తులో వివిధ రోగాల నుండి బిడ్డను కాపాడటానికి ఈ స్టెమ్ సెల్స్ ఉపయోగ పడతాయి.

స్టెమ్ సెల్ బ్యాకింగ్ వల్ల ఉపయోగాలను ఐశ్వర్యరాయ్ ఈ కార్యక్రమంలో వివరించారు.

ఎరుపురంగు సారీలో ఐశ్వర్యరాయ్

ఎరుపురంగు సారీలో ఐశ్వర్యరాయ్


ఈ కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్ ఎరుపురంగు సారీ, నలుపు బ్లౌజ్ ధరించి ఆకట్టుకునే రూపంతో హాజరైంది.

తల్లిదండ్రుల బాధ్యత

తల్లిదండ్రుల బాధ్యత


స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ అనేది తల్లిదండ్రుల బాధ్యతగా ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చారు.

ఐశ్వర్యరాయ్ కూతురుకు కూడా...

ఐశ్వర్యరాయ్ కూతురుకు కూడా...


తన కూతురు కోసం స్టెమ్ సెల్స్ భద్రపరిచినట్లు ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో వాటి వల్ల ఎంతో ఉపయోగం ఉండే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు.

అవగాహన ముఖ్యం

అవగాహన ముఖ్యం


స్టెమ్ సెల్స్ గురించి తల్లిదండ్రులందరికీ అవగాహన ఉండటం ఎంతో ముఖ్యమని ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చారు.

లైఫ్ సెల్

లైఫ్ సెల్


స్టెమ్ సెల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘లైఫ్ సెల్' సంస్థను ఐశ్వర్యరాయ్ అభినందించారు.

English summary
Aishwarya Rai Bachchan, who started her career in Tamil films with Iruvar, was spotted in Chennai on Sunday (July 27). The actress attended an event related to stem cell banking in the city.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu