యాడ్ ఫిల్మ్: అఖిల్ అక్కినేని సాహసం (ఫోటోస్)
హైదరాబాద్: పెప్సికో కంపెనీ ఉత్పత్తుల్లో ఒకటైన సాఫ్ట్ డ్రింక్ ‘మౌంటేన్ డ్యూ' బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా అఖిల్ పై యాడ్ ఫిల్మ్ చిత్రీకరణ పూర్తయింది. మౌంటేన్ డ్యూ యాడ్స్ అంటేనే అడ్వంచరస్ స్పోర్ట్స్‌తో కూడి సాహసోపేతంగా ఉంటాయి. తాజాగా అఖిల్ తో కూడా అలాంటి సాహసాలే చేసారు. కొండ ప్రాంతాల్లో ఈ చాడ్ ఫిల్మ్ చిత్రీకరించారు.

అఖిల్ ఇంకా ఇంకా సినిమాల్లోకి అడుగు పెట్టనప్పటికీ....అక్కినేని ఫ్యామిలీ వారసత్వం ఉండటం కావడం, తండ్రి నాగార్జున సపోర్టు ఉండటం ప్లస్సయింది. అఖిల్‌ను హీరోగా ప్రమోట్ చేయడంలో భాగంగా ఇలాంటి అవకాశాలు వచ్చేలా చేస్తున్నాడట నాగార్జున. ఇటీవల టైటన్ టైమ్ లెస్ యాడ్లో కల్కి కోచ్లిన్‌తో కలిసి అఖిల్ నటించిన సంగతి తెలిసిందే.

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ తెరంగ్రేటానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో సినిమాను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభిస్తారట. అఖిల్ తొలి సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. 2015 మే 1 నాటికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ సమాచారం వెలువడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.


Click it and Unblock the Notifications











