ఫోటోలు: అర్జున్-లక్ష్మీరాయ్‘రాణీ రాణమ్మ’కు దాసరి క్లాప్
హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం 'అరుంధతి' చిత్రంతో భారీ హిట్ కొట్టిన దర్శకుడు కోడి రామకృష్ణ తాజాగా మరో సినిమాను మొలు పెట్టారు. అర్జున్-లక్ష్మీరాయ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'రాణీ రాణమ్మ' అనే టైటిల్ ఖరారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఈచిత్రాన్ని రూపొందించనున్నారు.
ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం(ఏప్రిల్ 15) హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభం అయింది. దర్శకరత్న దాసరి నారాయణరావు తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఫ్యామిలీ డ్రామా కథాంశంతో సాగే ఈచిత్రం కథ ఇద్దరు దంపతులు, వారి పిల్లల చుట్టూ తిరుగుతుందని సమాచారం.
శైలజా ప్రొడక్షన్స్ బేనర్ పై ఆర్. రామచంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. హైదరాబాద్, కేరళ, రాజమండ్రి, శ్రీలంకలలో షూటింగును జరుపనున్నారు. ఆగస్టు వరకు చిత్రీకరణ పూర్తి చేసిన దసరాకి సినిమాను విడుదల చేయాలనే ప్లాన్లో నిర్మాతలు ఉన్నారు.
సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

అర్జున్, లక్ష్మీరాయ్‌లపై చిత్రీకరిస్తున్న తొలి సన్నివేశానికి క్లాప్ కొడుతున్న దాసరి.

దర్శుడు కోడి రామకృష్ణ, హీరో అర్జున్‌తో దాసరి.

దర్శకుడు, హీరోను గజమాలతో సత్కరిస్తున్న అభిమానులు.

తొలి సన్నివేశంలో హీరో అర్జున్, లక్ష్మీరాయ్ హావభావాలు.

చీర కట్టులో హాట్ లుక్ తో లక్ష్మీరాయ్.

హీరో అర్జున్.

రాణీ రాణమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్.


Click it and Unblock the Notifications











