బండ్ల గణేష్ ఇంటిపై ఐటి అధికారుల దాడుల ఫోటోలు...
హైదరాబాద్ : టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్ నివాసంపై, ఆఫీసుపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిన్న(ఫిబ్రవరి 11) దాడి చేసి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్న మొదలైన సోదాలు మంగళవారం వరకు కొనసాగాయి. అనుమానం వచ్చిన అధికారులు గణేష్‌ను తమ ఆఫీసుకు పిలిపించుకుని ప్రశ్నించి వదిలి పెట్టారు.
గణేష్ సినిమా రంగంలోకి జూనియర్ ఆర్టిస్టుగా ఎంటరై పలు సినిమాల్లో చిన్న చిన్నపాత్రలు వేయడం మొదలు పెట్టారు. 2009లో ఆంజనేయులు సినిమా ద్వారా గణేష్ నిర్మాతగా మారారు. ఆయన నిర్మించిన గబ్బర్ సింగ్ సినిమా భారీ విజయం సాధించడంతో గణేష్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. ఆ సినిమా అనంతరం స్టార్ హీరోలైన జూ ఎన్టీఆర్‌తో 'బాద్ షా' చిత్రం, అల్లు అర్జున్‌తో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాన్ని ఏక కాలంలో నిర్మిస్తున్నారు.
బాద్ షా, ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో కేవలం స్టార్ హీరోలతో కూడిన సినిమాలు మాత్రమే కాదు.....ఈచిత్రాలకు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లు అయిన శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్‌లు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలు పూర్తి కాకముందే 'మిర్చి' దర్శకుడు కొరటాల శివతో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నట్లు మరో ప్రకటన చేసారు గణేష్.

గబ్బర్ సింగ్ సినిమా కంటే ముందు ఆంజనేయులు, తీన్ మార్ చిత్రాలను గణేష్ నిర్మించారు.

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘గబ్బర్ సింగ్' చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది.

జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో ‘బాద్ షా' చిత్రం రూపొందిస్తున్న గణేష్ ఈచిత్రానికి రూ. 50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారని టాక్.

మరో వైపు అల్లు అర్జున్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి రూ. 35 కోట్లు వరకు బడ్జెట్ కేటాయించారు.

మరో వైపు త్వరలో కొరటాల శివతో తీయబోయే సినిమా కోసం రూ. 20 కోట్లతో అంచనాలు తయారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఐటి అధికారుల కన్ను బండ్ల గణేష్‌పై పడింది. ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో గణేష్ అనతి కాలంలోనే ఇంతలా ఎలా ఎదిగారు? ఏక కాలంలో ఇంత డబ్బు పెట్టుబడి పెట్టి సినిమా ఎలా తీస్తున్నారు అనే విషయాలపై అధికారులు ఆరా తీయడం మొదలు పెట్టారు. బండ్ల గణేష్ నివాసంపై ఐటి అధికారులు దాడి చేసినప్పటి దృశ్యాలు....ఆయన ఇంటి ముందు మీడియా ప్రతినిధులు హడావుడి చేస్తున్న ఫోటులు క్రింది స్లైడ్ షోలో వీక్షించండి.


Click it and Unblock the Notifications











