త్రిష: ఎంగేజ్ మెంట్ పార్టీ లో సినీ సెలబ్రెటీలు(ఫొటోలు)
హైదరాబాద్: అనుకున్నట్లుగా జనవరి 23న చెన్నైలో కుటుంబ సభ్యుల మధ్య త్రిష, వరుణ్‌ల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. చెన్నైలోని ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు కుటుంబ సభ్యులు మరియు వారి స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఎంగేజ్ మెంట్ పార్టీలో ఛార్మీ, మాధవన్, ధనుష్, శింబు, ఆర్య, సంగీత దర్శకుడు అనిరుధ్, దేవిశ్రీ ప్రసాద్ వంటి వారు పాల్గొన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈరోజు మధ్యాహ్నాం 12గంటలకు త్రిష-వరుణ్‌ల నిశ్చితార్ధం జరిగింది. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న వీరు చూడముచ్చటగా ఉన్నారు. త్రిష పట్టుచీర కట్టి అచ్చతెలుగు ఆడపిల్లలా ఉంటే..వరుణ్ మణియన్ పట్టు పంచెలో అదరగొట్టాడు.
శనివారం... ఎంగేజ్ మెంట్ పార్టీని ఘనంగా ఇచ్చింది. ఈ పార్టీకి త్రిష ఫ్రెండ్స్ మాత్రమే కాక సినీ పరిశ్రమ నుంచి ఛార్మీ, దేవిశ్రీ ప్రసాద్ వంటి సెలబ్రెటీలు హాజరయ్యారు. త్రిష ఆ పార్టీలో చాలా ఆనందంగా కనిపించింది.
ఎంగేజ్ మెంట్ పార్టీ ఫొటోలు

చెన్నైలో..
చెన్నై చిన్నది త్రిష, నిర్మాత వరుణ్ మణియన్‌ల నిశ్చితార్థం శుక్రవారం చెన్నైలో జరిగింది.

తమిళ తెరకు
1999లో 'మిస్ చెన్నై'గా ఎంపికైన త్రిష 2002లో తమిళ తెరకు పరిచయమైంది.

తెలి సారి..
ప్రభాస్ సరసన 'వర్షం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

12 ఏళ్లుగా...
దాదాపు 12 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించింది.

ప్రస్తుతం
బాలకృష్ణ సరసన 'లయన్' చిత్రంలో ఆడిపాడుతోంది.

అతనో నిర్మాత
'వాయై మూడి పేసవుం' చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమైన వరుణ్‌మణియన్‌తో ఆమె ప్రేమలో పడ్డారు.

పెళ్లి కొడుకు ఇంట్లోనే...
శుక్రవారం ఉదయం వీరి నిశ్చితార్థం చెన్నై, ఆళ్వార్‌పేటలోని వరుణ్ మణియన్ ఇంట్లో జరిగింది.

నో సినిమా వాళ్ళూ...
కార్యక్రమానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

ముస్తాబు..
త్రిషను ముంబయికి చెందిన ఓ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ముస్తాబు చేశారు. అనంతరం త్రిష, వరుణ్ ఉంగరాలు మార్చుకున్నారు.

విందు
చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరు నటీ నటులకు శనివారం విందు ఇచ్చారు.


Click it and Unblock the Notifications











