ఫోటోలు : షారుక్, దీపికలతో ప్రియమణి సందడి
ముంబై : షారుక్ ఖాన్, దీపిక పడుకొనె హీరో హీరోయిన్లుగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందిస్తున్న చిత్రం 'చెన్నై ఎక్స్‌ప్రెస్'. ఆగస్టు 8న విడుదలకు సిద్ధమైన ఈచిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని బుధవారం ముంబైలో అట్టహాసంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హీరో హీరోయిన్లు షారుక్ కాన్, దీపిక పడుకొనె, దర్శకుడు రోహిత్ శెట్టితో పాటు....ఈ సినిమాలో ఐటం సాంగులో నర్తించిన దక్షిణాది హీరోయిన్ ప్రియమణి కూడా హాజరై సందడి చేసింది. ఆడియో విడుదల కార్యక్రమంలో తారలంతా ఎంతో సందడిగా ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆడియో వేడుక ఫోటోలు, సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

ముంబై నుంచి రామేశ్వరం వరకు ప్రయాణం చేసిన చిత్ర కథానాయకుడికి ఎదురైన అనుభవాలతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

తాజాగా విడుదలైన ఈచిత్రం ట్రైలర్ చూస్తుంటే పలు దక్షిణాది చిత్రాలతో పాటు, తెలుగు సినిమాలైన ఒక్కడు, నరసింహ నాయుడు, అంత:పురం, మర్యాద రామన్న లాంటి చిత్రాల్లోని సీన్లను దర్శకుడు రోహిత్ కాపీ కొట్టాడని స్పష్టం అవుతోంది.

బాలీవుడ్ ప్రేక్షకులకు దక్షిణాది సినిమాలు పెద్దగా పరిచయం లేదు. దీంతో వాటిని ఈ సినిమాల్లోని కొన్నిసీన్లను తన క్రియేటివిటీగా అక్కడి ప్రేక్షకులకు చూపించబోతున్నాడు దర్శకుడు

రోహిత్ శెట్టికి బాలీవుడ్లో మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇప్పటి వరకు ఆయన 8 సినిమాలు తీస్తే అందులో 7 సూపర్ హిట్ కాగా ఒకటి మాత్రం యావరేజ్.

రోహిత్ శెట్టి గత చిత్రాలు చూసిన షారూఖ్ ఇంప్రెస్ అయి తన డేట్స్ ఇవ్వటానికి ముందుకు రావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కింది.

దర్శకుడు రోహిత్ శెట్టి మాట్లాడుతూ..నిజానికి షారూఖ్ ని ఇంప్రెస్ చేయటం అంత ఈజీ కాదు. ఆయనతో మంచి యాక్షన్ కామెడీ చేయాలనేది నా కోరిక. ఈ సినిమా షారూఖ్ అభిమానులను అలరించే సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను అంటున్నారు.

దర్శకుడు రోహిత్ శెట్టి మాట్లాడుతూ..నిజానికి షారూఖ్ ని ఇంప్రెస్ చేయటం అంత ఈజీ కాదు. ఆయనతో మంచి యాక్షన్ కామెడీ చేయాలనేది నా కోరిక. ఈ సినిమా షారూఖ్ అభిమానులను అలరించే సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను అంటున్నారు.

మణిరత్నం, అభిషేక్, ఐశ్వర్యల కాంబినేషన్లో వచ్చిన రావన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రియమణి తర్వాత ఆర్‌జివి రక్త చరిత్రతో నటించినా ఆశించిన పేరు దక్కలేదు. తర్వాత బాలీవుడ్ ఆఫర్లు అంతగా రాకపోవడంతో సౌత్ కే ఫిక్స్ అయిపోయింది.

చాలా కాలం తర్వాత షారుక్ హీరోగా రూపొందిన బాలీవుడ్ మూవీ 'చెన్నై ఎక్స్ ప్రెస్' లో ప్రియమణికి ఐటం సాంగు చేసే అవకాశం దక్కింది.

గతంలో షారుక్ చేసిన 'చయ్య చయ్య సాంగ్' మాదిరి ప్రియమణి చేసిన ఐటం సాంగు సాగుతుంది. ఈ పాటకు అసలు ప్రియమణి పారితోషికమే తీసుకోలేదట.

ప్రియమణి ఫ్రీగా చేయడం వెనక పెద్ద ప్లానే ఉందని, ఈ చిత్రంలో తన ఐటం సాంగుకు మంచి పేరొస్తే మరిన్ని బాలీవుడ్ వస్తాయనే ఆలోచనతో ఉందని, అవకాశాలు వస్తే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుందనే సూత్రాన్ని ప్రియమణి ఫాలో అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్.

ఆగస్టు 8న విడుదలకు సిద్ధమైన ఈచిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల చేసారు. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.

రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై షారుక్ భార్య గౌరీఖాన్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











