చిరంజీవి, బాలయ్య కోటి కూతురు వెడ్డింగ్(చిత్రాలు)

By Bojja Kumar

హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కమార్తె భాగ్యలక్ష్మి వివాహం శ్రీనివాస్ అనే వ్యక్తితో ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వన్షన్ సెంటర్లో జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, అక్కినేని నాగేశ్వరరావు, తరుణ్, రాజశేఖర్, జీవిత, దర్శకుడు రాజమౌళి మరియు అతని భార్య రమ, కె. రాఘవేంద్రరావు, ఎంఎం కీరవాణి మరియు అతని భార్య శ్రీవల్లి, సింగర్స్ ఎస్ జానకి, సునీత మరియు పలువురు సెలబ్రిటీలు హాజరై వదూవరులను దీవించారు. 2012 సంవత్సరంలో టాలీవుడ్ జరిగిన పెద్ద పెళ్లి వేడుకల్లో ఇదొకటిగా చర్చించుకుంటున్నారు.

 చిరంజీవి, బాలయ్య @ కోటి కూతురు వెడ్డింగ్(చిత్రాలు)

సంగీత దర్శకుడు కోటి కూతురు భాగ్యలక్ష్మి, అల్లుడు శ్రీనివాస్

చిరంజీవి, బాలయ్య @ కోటి కూతురు వెడ్డింగ్(చిత్రాలు)

పెళ్లి వేడుకకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి

చిరంజీవి, బాలయ్య @ కోటి కూతురు వెడ్డింగ్(చిత్రాలు)

కోటి కూతురు పెళ్లి వేడుకలో నందమూరి బాలకృష్ణ

చిరంజీవి, బాలయ్య @ కోటి కూతురు వెడ్డింగ్(చిత్రాలు)

పెళ్లి వేడుకలో మోహన్ బాబు

 చిరంజీవి, బాలయ్య @ కోటి కూతురు వెడ్డింగ్(చిత్రాలు)

వదూ వరులతో జీవిత రాజశేఖర్

 చిరంజీవి, బాలయ్య @ కోటి కూతురు వెడ్డింగ్(చిత్రాలు)

నూతన దంపతులతో రాజమౌళి మరియు ఆయన భార్య రమ

చిరంజీవి, బాలయ్య @ కోటి కూతురు వెడ్డింగ్(చిత్రాలు)

ఎంఎం కీరవాణి తన ఫ్యామిలీతో హాజరైన దృశ్యం

చిరంజీవి, బాలయ్య @ కోటి కూతురు వెడ్డింగ్(చిత్రాలు)

తల్లితో కలిసి హాజరైన హీరో తరుణ్

 చిరంజీవి, బాలయ్య @ కోటి కూతురు వెడ్డింగ్(చిత్రాలు)

కోటి కుటుంబంతో అక్కినేని నాగేశ్వరరావు

 చిరంజీవి, బాలయ్య @ కోటి కూతురు వెడ్డింగ్(చిత్రాలు)

పెళ్లి వేడుకకు హాజరైన సింగర్ ఎస్ జానకి

సంగీత దర్శకుడు కోటి గురించి ప్రస్తావనకు వస్తే....

కోటి ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు కుమారుడు. ఇతని పూర్తి పేరు సాలూరి కోటేశ్వరరావు. కోటి మరియు మరొక సంగీత దర్శకుడు రాజ్ తో కలిసి 'రాజ్-కోటి'గా పలు సినిమాలకు విజయవంతమైన సంగీతం అందించారు. ప్రళయ గర్జన వీరిద్దరూ కలిసి పని చేసిన మొదటి చిత్రం.ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్ లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు. రాజ్ ఒక్కడే చేసిన సినిమాల్లొ "సిసింద్రీ" ఒక్కటే చెప్పుకోదగినది. కోటి ఒంటరిగా పనిచేసి పెద్ద హీరోలతో హిట్లు ఇచ్చాడు. చిరంజీవి తో హిట్లర్, బాలక్రిష్ణ తో పెద్దన్నయ్య, వెంకటేశ్ తో నువ్వు నాకు నచ్చావ్ మొదలైనవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X