ఫోటోలు: బిగ్ బీ పుట్టిన రోజు పార్టీలో తెలుగు హీరోలు
ముంబై: భారతదేశంలో పేరుగాంచిన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి ఎంత రాసినా తక్కువేననిపిస్తుంది. తన జీవితంలో ఎన్ని అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా విజయం కోసం పోరాడిన మహా నటుడు అమితాబ్. సినీ పరిశ్రమలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన ఆయన గురువారం(అక్టోబరు 11న) 70వ జన్మదినం తన స్నేహితులు, సన్నిహితుల మధ్యన ఆనందంగా జరుపుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమనుంచి కూడా చాలా మంది నటులు హాజరయ్యి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ధట్స్ తెలుగు' అందిస్తున్న ప్రత్యేక కథనమిది.

మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ క్లోజ్ ప్రెండ్స్. వారి కుటుంబ సభ్యులు కూడా తరుచుగా కలుస్తూంటారు. రామ్ చరణ్ వివాహానికి సైతం అమితాబ్ అప్పుడు హాజరై శుభాకాంక్షలు అందించారు. అందుకేనేమో చిరంజీవి తన భార్య సురేఖ తో కలిసి ముంబై వచ్చి బిగ్ బికి విషెష్ తెలియచేసారు.

అక్కినేని నాగార్జున, అమితాబ్ కలిసి ఖదాగవా చిత్రంలో చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. వారిద్దరూ మంచి స్నేహితులనే చాలా మందికి తెలియని విషయం. అందుకేనేమే 70 పుట్టిన రోజుకు ఈ రోజుకీ యంగ్ మ్యాన్ లా ఉండే నాగార్జున తన భార్య అమలతో కలిసి హాజరయ్యారు. కింగ్ ఆ పంక్షన్ కి హాజరు కావటం బిగ్ బికి చాలా ఆనందమనిపించింది.

అమితాబ్ కెరీర్ లో సూపర్ హిట్ జంజీర్. యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ని అమితాబ్ ఇచ్చిన జంజీర్ ఇప్పుడు రీమేక్ అవుతోంది. రీమేక్ వెర్షన్ లో హీరో రామ్ చరణ్. ఈ సినిమాలో చేసెటప్పుడు రామ్ చరణ్.. వెళ్లి బిగ్ బి ఆశీస్సలు తీసుకున్నాడు. అంతేకాదు రామ్ చరణ్ వివాహానికి అమితాబ్ సైతం వచ్చారు. ఇప్పుడు చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి వచ్చి ఈ బర్తడే పార్టీలో పాల్గొన్నారు. అమితాబ్ కి ఆనందం కలిగించాడు.

రీసెంట్ గా అమితాబ్ కలిసి నటించిన తెలుగు హీరో రాణా దగ్గుపాటి. వర్మ డిపార్టమెంట్ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అంతకుముందు అమితాబ్ కుమారుడు అబిషేక్ తో కలిసి దమ్ మారో దమ్ చిత్రంలో చేసారు. ఇలా తండ్రి, కుమారులతో కలిసి నటించిన రాణా, ఇప్పుడు బిగ్ బి పుట్టిన రోజుకి వెళ్లి అక్కడ ప్రధాన ఆకర్షణగా మారారు.

హీరోలకే కాదు విలన్స్ కీ అమితాబ్ అంటే అబిమానమే. తెలుగు సినిమా స్టార్ విలన్ ముఖేష్ రుషి ఈ బర్తడే పంక్షన్ కి హాజరయ్యారు. ఆయన అమితాబ్ కలిసి కాలియా(1981), మతృదండ(1997) చిత్రాలు చేసారు. అంతేకాక ఆయన కుమారుడు అబిషేక్ కలిసి రన్ (2004) చిత్రం చేసారు. అమితాబ్ కుటుంబంతో ముఖేష్ రుషికి ప్రత్యేక అభిమానముంది.
తెలుగు నుంచి చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్ తేజ వంటివారు హాజరైన అమితాబ్ పుట్టిన రోజు వేడుకలకి హింది నుంచి షారూఖ్,అమీర్ ఖాన్, అజయ్ దేవగన్,దిలీప్ కుమార్,యాష్ చోప్రా వచ్చారు. రజనీకాంత్ సైతం ఈ పుట్టిన రోజు పంక్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా మారారు. అమితాబ్ కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యా రాయ్ ఈ గెస్ట్ లను రిసీవ్ చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











