ఫోటోలు : థాయ్‌లాండ్‌లో గాయపడ్డ వీణా మాలిక్

By Bojja Kumar

థాయ్‌లాండ్ : కన్నడమూవీ 'సిల్క్ సక్కత హాట్ మగ' చిత్రం షూటింగులో బిజీగా ఉన్న పాక్ బ్యూటీ వీణా మాలిక్ సినిమా సెట్స్‌లో గాయపడింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. ఇక్కడ చిత్రీకరణ జరుగుతుండగా వీణా మాలిక్ గాయపడింది.

థాయ్‌లాండ్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో 'సిల్క్ సక్కత హాట్ మగ' చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంలో ఆమె పాదానికి గాయమై రక్తస్రావం జరిగింది. వెంటనే డాక్టర్ ను సెట్‌కు పిలిపించి ఆమె కాలికి బ్యాండేజ్ వేసి ప్రథమ చికిత్స నిర్వహించారు.

వీణా మాలిక్ గాయం కారణంగా షూటింగ్‌కు కొన్ని గంటల పాటు విరామం ఇచ్చారు. ఆమె కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించారు. ప్రొడక్షన్ టీం సభ్యులు మాట్లాడుతూ....వీణా మాలిక్ సినిమా కోసం అంకిత భావంతో పని చేస్తుందని, ప్రమాద వశాత్తు ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు.

తన గాయం గురించి వీణా మాలిక్ మాట్లాడుతూ...'గాయ పడటం నాకు కొత్తేమీ కాదు. అయితే ప్రస్తుతం ఇక్కడ రొమాంటిక్ సాంగు చిత్రీకరణ సాగుతున్నందున గాయం బాధించడం కారణంగా పాటకు తగిన విధంగా హావభావాలు ప్రకటించలేక పోతున్నానని' వెల్లడించింది.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

గాయమైనా విశ్రమించని వీణా

వీణా మాలిక్ తన కాలికి గాయమైనా సరే ఎక్కువగా విశ్రాంతి తీసుకోకుండా కేవలం కొన్ని గంటల వ్యవధిలనే షూటింగుకు సిద్ధమైంది.

థాయ్‌లాండ్ ఎంతో అందమైన ప్రదేశం

థాయ్ లాండ్ ఎంతో అందమైన ప్రదేశమని, ఇక్కడ షూటింగులో పాల్గొనడం ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని, ఈ ప్రాంతాన్ని నేను ఎంతో ఇష్టపడుతున్నానని వీణా మాలిక్ చెప్పుకొచ్చింది.

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా...

సిల్క్ సక్కత్ హాట్ మగా చిత్రం మాజీ సెక్సీతార సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు.

ఇదొక A సర్టిఫికెట్ ఫిల్మ్

వీణా మాలిక్ నటిస్తున్న ‘సిల్క్ సక్కత్ హాట్ మగ' పెద్దలకు మాత్రమే పరిమితమైన A సర్టిఫికెట్ మూవీ.

ఆ సీన్లకు కత్తెరే...

ఇప్పటికే విడుదలైన సిల్క్ సక్కత్ హాట్ మగ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు మరీ సెక్సీగా ఉండటంతో సెన్సార్ బోర్డు వాటికి కత్తెర వేసేందుకు రెడీ అవుతున్నారు.

సెక్సీగా సెన్సేషన్...

వీణా మాలిక్ ఇప్పటి వరకు తన కెరీర్లో ఏ సినిమాలోనూ చేయని విధంగా సెక్సీగా ఈ చిత్రంలో రెచ్చిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటో అందాల ఆరబోత, రొమాంటిక్ సీన్లలో హద్దులు దాటిందనే చెప్పొచ్చు.

జులై నెలలో విడుదలకు సిద్ధం..

ఈ చిత్రం జులై నెలలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా కోసం శృంగార ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అభిమానులను షేక్ చేస్తున్న వీణా సెక్సీ షేపులు

వీణా మాలిక్ ఈచిత్రంలో ఏ రేంజిలో రెచ్చిపోయి అందాలు ఆరబోసిందో ఈ చిత్రానికి సంబంధించి ఫోటోషూట్లు స్పష్టం చేస్తున్నాయి. ఆ ఫోటోల్లో వీణా మాలిక్ సెక్సీ షేపులు అభిమానుల మతి పోగొడుతున్నాయి.

సినిమాలో రెండు లిప్ లాక్ సీన్లు

ఈ సినిమాలో తన కోస్టార్ అక్షయ్‌తో కలిసి రెండు లిప్ లాక్ సీన్లలో వీణా మాలిక్ పాల్గొంది. ఆ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయని అంటున్నారు యూనిట్ సభ్యులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X