»   » ప్రియుడు శింబుతో పార్టీలో హన్సిక(ఫోటోలు)

ప్రియుడు శింబుతో పార్టీలో హన్సిక(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళ నటుడు శింబు, హీరోయిన్ హన్సిక ప్రేమించుకుంటున్న విషయాన్ని ఇటీవల వారే బయట పెట్టిన సంగతి తెలిసిందే. తమ మధ్య లవ్ మొదలయ్యాక ప్రియురాలి మొదటి బర్త్‌డే కాబట్టి స్పెషల్ గా సెలబ్రేట్ చేసాడు శింబు. ఆగస్టు 9న హన్సిక 22వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించని ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ నెట్వర్కింగులో హల్ చల్ చేస్తున్నాయి.

తన పుట్టిన రోజును పురస్కరించుకుని హన్సిన అనాద పిల్లలతో కలిసి గడిపింది. వారి సమక్షంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకుంది. వారికి స్వీట్లు పంచడంతో పాటు బహుమతులు అందజేసింది. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ ' 2012-2013 సంవత్సరం నాకు బాగా కలిసొచ్చింది. కెరీర్లో సక్సెస్‌లు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి' అని తెలిపింది.

ప్రేక్షకుల ఆదరణ వల్లనే తాను ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగానని, తనను ఎప్పుడూ ఇలానే ఆదరిస్తారని కోరుకుంటున్నానని హన్సిక వ్యాఖ్యానించింది. ఆ తర్వాత హన్సిక తన ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు తన వ్యక్తిగత జీవితంలోకి కొత్తగా ప్రవేశించిన శింబుతో కలిసి గడిపింది. ప్రిన్సెస్ అనే ప్రత్యేకమైన కేక్ తెప్పించి ఆమెతో కట్ చేయించాడట.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు

ప్రేమ విషయం వెల్లడించిన హన్సిక

ప్రేమ విషయం వెల్లడించిన హన్సిక


శింబు, హన్సిక మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్న విషయం స్వయంగా హన్సిక ద్వారానే అభిమానులకు తెలిసిందే. గత నెల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా బయట పెట్టింది. శింబుతో ప్రేమలో ఉన్నట్లు ధృవీకరించింది.

శింబు కూడా కన్‌ఫర్మ్ చేసారు

శింబు కూడా కన్‌ఫర్మ్ చేసారు


హన్సిక మాత్రే కాదు...అటు శింబు కూడా హన్సికతో ప్రేమలో ఉన్న విషయాన్ని బయట పెట్టారు. త్వరలో పెద్దల అంగీకారంతో తాము పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని కూడా శింబు వెల్లడించారు.

మీడియా మద్దతు కావాలి

మీడియా మద్దతు కావాలి


శింబు, హన్సిక మీడియా మద్దతు కావాలని కోరారు. తమ రిలేషన్ విషయంలో ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్ద, ఏమైనా అనుమానాలు వుంటే తమను సంప్రదించి క్లారిఫై చేసుకోవాలని కోరారు.

అజిత్-శాలినిలే ఆదర్శం

అజిత్-శాలినిలే ఆదర్శం


తమ ప్రేమ విషయం గురించి శింబు మాట్లాడుతూ......అజిత్-శాలిని మాదిరి తాము కూడా అన్యోన్యమైన దాంపత్య జీవితం గడుపుతామని వెల్లడించారు. పెద్దల అంగీకారంతోనే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు శింబు వెల్లడించారు.

పెళ్లి ఎప్పుడంటే...?

పెళ్లి ఎప్పుడంటే...?


ప్రస్తుతం శింబు, హన్సిక తమ తమ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక పెళ్లి విషయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.

ఇరు కుటుంబాలు హ్యాపీ

ఇరు కుటుంబాలు హ్యాపీ


శింబు, హన్సిక సన్నిహితులు చెబుతున్నదాని బట్టి వీరిద్దరి వివాహంపై శింబు కుటుంబ సభ్యులతో పాటు, హన్సిక కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారని, వారి అంగీకారం తర్వాతనే ప్రేమ విషయం బయట పెట్టారని తెలుస్తోంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు


శింబు, హన్సికలు ప్రస్తుతం రెండు చిత్రాల్లో బిజీగా ఉన్నారు. త్వరలో వీరు వాలు, వెట్టై మన్నన్ అనే చిత్రాల్లో నటించబోతున్నారు. ఈ చిత్రాలు పూర్తయ్యాక పెళ్లి కార్యక్రమంపై దృష్టి సారించనున్నారు.

English summary
Hansika Motwani's birthday was made special by Silambarasan aka Simbu this time. The actress, who celebrated her 22 birthday on August 9, partied with her beau and they both together had a great time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu