మంచు విష్ణు పెళ్లి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?
హైదరాబాద్: హీరో మంచు విష్ణు వివాహం వెరోనికా రెడ్డితో మార్చి 1, 2009న జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి మార్చి 1న తన పెళ్లి రోజు వేడుకను ఘనంగా జరుపుకునే విష్ణు ఈ సారి మాత్రం పెళ్లి రోజు వేడుకలకు పూర్తిగా దూరంగా ఉన్నాడు. ఈ సారి పెళ్లి రోజు వేడుకకన్నా తను నటిస్తున్న చిత్రం షూటింగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు ఈ హీరో. ఏ భార్య అయినా పెళ్లి రోజు నాడు భర్తతో ఏకాంతంగా గడపాలని కోరుకుంటుంది. అదే ఆశతో ఉన్న వెరోనికా విష్ణు నిర్ణయంతో కాస్త డిస్పప్పాయింట్ అయినప్పటికీ ఆమెను మరో రకంగా కన్విన్స్ చేసాడు విష్ణు. త్వరలో ఒక రోజంతా తనతో కలిసి షాపింగ్ చేస్తానని మాటిచ్చాడట.
ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ...'పెళ్లి రోజు నేను ఆమెతో కలిసి గడపాలని అనుకున్నాను. కానీ అనుకోని విధంగా షూటింగులో బిజీగా గడపాల్సి వచ్చింది. నా పరిస్థితిని వెరోనికా కూడా అర్థం చేసుకుంది. త్వరలో తనతో కలిసి ఫుల్ డే షాపింగ్ చేస్తానని మాటిచ్చాను. వచ్చే సారి పెళ్లి రోజుకు మేమిద్దరం కలిసి విదేశాల్లో జాలీగా గడపాలని ప్లాన్ చేస్తున్నా' అని చెప్పుకొచ్చాడు.
పెళ్లి రోజును పురస్కరించుకుని వెరోనికా నాకు క్రోమ్ హార్ట్స్ బ్రాండ్ కు చెందిన సన్ గ్లాసెస్ గిఫ్టుగా ఇచ్చింది. అవి నాకెంతో నచ్చాయి. ఆమె గుర్తుగా షూటింగ్ అయిపోయే వరకు నేను వీటిని ఎప్పుడూ పెట్టుకునే ఉంటాను... అని తన భార్య పట్ల ప్రేమను ప్రదర్శించాడు విష్ణు. మంచు విష్ణు-వెరోనికా వివాహం 2009లో జరిగింది. వీరికి ఇద్దరు కవల పిల్లలు. ఒకరి పేరు అరియానా, మరికొరి పేరు వివియానా. తన భార్య గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తూ 'ఆమెతో గడిపిన ప్రతి క్షణం నాకు ప్రత్యేకమే. ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చి రోజు మాత్రం నా జీవితంలో మరిచిపోలేనిది' అని తెలిపారు.
మంచు విష్ణు, వెరోనికా రేర్ పిక్చర్స్ స్లైడ్ షోలో వీక్షించండి.

మంచు విష్ణు నటించిన ఢీ సినిమాకు వెరోనికా కాస్టూమ్ డిజైనర్ గా పని చేసింది. ఈ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

వెరోనికా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ సుధీర్ రెడ్డి కుమార్తె.

వీరి పెళ్లి సందర్భంగా హైదరాబాద్ లోని జిఎంసి బాలయోగి స్టేడియంలో గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేసారు.

వీరి పెళ్లి వేడుకకు రజనీకాంత్ తో పాటు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

డిసెంబర్ 2011లో ఈ దంపతులు ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒకరి పేరు అరియానా, మరొకరి పేరు వివియానా.

వెరోనికా బేబీ షవర్ ఫంక్షన్ కు సినీరంగంలోని టాప్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

తమ కవల పిల్లలతో ఆడుకుంటూ విష్ణు-వెరోనికా.

రామ్ చరణ్ తో విష్ణు, వెరోనికా, మంచు లక్ష్మి.

మరిది మనోజ్ తో వెరోనికా, ఆమె కవల పిల్లలు.

తల్లి, భార్యతో కలిసి మంచు విష్ణు.

తన కవల పిల్లలతో మంచు విష్ణు.

తన కవల పిల్లలతో వెరోనికా.


Click it and Unblock the Notifications











