ఎన్టీఆర్ కోసం పాత కార్లు సేకరణ...పెద్ద షెడ్ (షెడ్ ఫొటోలు)
హైదరాబాద్ : ఎన్టీఆర్ అభిమానులకు ఆనందపరిచే న్యూసే ఇది. నాన్నకు ప్రేమతో చిత్రం తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. అతి త్వరలో సారధి స్టూడియోస్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
తొలి చిత్రం నుంచి ఇప్పటిదాకా : ఎన్టీఆర్ లో మార్పులు ఇలా (ఫొటో ఫీచర్)
ఈ మేరకు దాదాపు మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్టీఆర్ పనిచేసే గ్యారేజ్ ను.. దాని పరిసరాలను సెట్ వేశారు. ఈ సెట్ లుక్ అద్భుతంగా వచ్చిందని చూసినవాళ్లు చెబుతున్నారు. మరి మీకూ చూడాలని ఆసక్తి ఉంటుంది కదా అందుకే బయిటనుంచి తీసిన ఆ ఫొటోలు మీకు అందచేస్తున్నాం.
మహేష్, చరణ్, ఎన్టీఆర్ ల గురించి కాజల్ (ఫొటో ఫీచర్)
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ జంటగా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మిర్చి, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ లను అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమంతుడు నిర్మాతలు ...మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
పవన్,మహేష్,ఎన్టీఆర్ ల గురించి సమంత (ఫొటో ఫీచర్)
సెట్ ఫొటోలు స్లైడ్ షోలో...

ప్రత్యేకంగా..
గ్యారేజీకి సంబంధించిన మెకానిక్ షెడ్, దాని చుట్టుపక్కల ప్రాంతాలు కలిసేవిధంగా ఈ సెట్ డిజైన్ చేస్తున్నారు

పర్యవేక్షణలో..
కళా దర్శకుడు ఎ.ఎస్.ప్రకాష్ పర్యవేక్షలో ఈ సెట్ నిర్మాణమవుతోందని

మేదర్ షూట్..
చిత్రానికి సంభందించి మేజర్ చిత్రీకరణంతా ఈ సెట్లోనే జరుగుతుందని అంటున్నారు.

పాత కార్లు తెచ్చే పనిలో..
ఈ గ్యారేజ్ లోకి ఇప్పుడు పాత కార్లు తెచ్చే పనిలో ఉన్నారు టీమ్ . ఓ 15-20 పాత కార్లను గ్యారేజ్ లో చేర్చే పనిలో పడ్డారు యూనిట్.

ఒరిజనల్ గెటప్ తోనే..
గత రెండు సినిమాల్లో రెండు డిఫరెంట్ లుక్స్ చూపించిన ఎన్టీఆర్.. ఈ మూవీ కోసం తన ఒరిజినల్ గెటప్ నే ఎంచుకున్నాడని తెలుస్తోంది.

స్పెషల్ ఎట్రాక్షన్
సమంత - నిత్యామీనన్ లు హీరోయిన్ లు గా నటిస్తున్న జనతా గ్యారేజ్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

అదిరే బిజినెస్
కాంబినేషన్స్ సూపర్బ్ గా ఉండడంతో.. ఇప్పటికే ఈ మూవీకి అన్ని ఏరియాల నుంచి మంచి బిజినెస్ జరుగుతోంది.

అందుకే
రెండవ హీరోయిన్ గా నిత్యామీనన్ ఎంపికైంది. కథ ప్రకారం ...మోహన్ లాల్ కి ధీటుగా.. చక్కటి అభినయాన్ని ప్రదర్శించే అమ్మాయి కావాలనే ఎంపిక చేసారని అంటున్నారు.

దేవయాని
ఈ సినిమాలో మోహన్ లాల్ భార్యగా దేవయాని కనిపించనుంది.

ప్రీ రిలీజ్ బిజినెస్
హీరోకు నాన్నకు ప్రేమతో హిట్, అటు దర్శకుడుకి శ్రీమంతుడు హిట్ ఉండటంతో బిజినెస్ ముందే జరిగిపోయింది.


Click it and Unblock the Notifications











