ఐపీఎల్ 2018 యాడ్ షూటింగులో జూ ఎన్టీఆర్ (ఫోటోస్)

By Bojja Kumar

ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్ నెట్వర్క్.... ఈ టోర్నీని తన నెట్వర్క్ విస్తరించి ఉన్న అన్ని భాషల్లో ప్రసారం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తెలుగులో ఐపీఎల్‌ 2018ని ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్‌ను వాడుకోనున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ మీద ఓ యాడ్ చిత్రీకరించారు. ఈ షూటింగుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

Recommended Video

IPL 2018 Is Going To Get Launched By Junior Ntr
మా స్టార్ స్థాయి పెంచిన ఎన్టీఆర్

మా స్టార్ స్థాయి పెంచిన ఎన్టీఆర్

'స్టార్ మా'లో గతేడాది ప్రసారం అయిన 'బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షో తొలి సీజన్‌ను హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఈ షో సూపర్ సక్సెస్ అవ్వడంలో ప్రధాన భూమిక పోషించారు. అప్పట్లో 'మా' టీవీని సొంతం చేసుకుని తెలుగులో కొత్తగా ప్రయాణం ప్రారంభించిన స్టార్ నెట్వర్క్‌కు ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ మంచి బూస్ట్ ఇచ్చింది.

కాదనలేక పోయిన ఎన్టీఆర్

కాదనలేక పోయిన ఎన్టీఆర్

ఇటీవలే ఎన్టీఆర్‌ను స్టార్ నెట్వర్క్ ప్రతినిధులు కలిసి ఈ విషయమై మాట్లాడారు. ఐపీఎల్ 2018ని ప్రమోట్ చేస్తూ యాడ్స్‌లో నటించాలని కోరారు. ఆ చానల్‌తో మంచి అనుబంధం ఉండటంతో ఎన్టీఆర్ కూడా కాదనలేక పోయారట.

దూరంకాక తప్పలేదు

దూరంకాక తప్పలేదు

త్వరలో ప్రారంభం అయ్యే తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 2 కూడా యంగ్ టైగర్‌తోనే హోస్ట్ చేయించాలని స్టార్ నెట్వర్క్ యాజమాన్యం భావించినా.... తన వరుస సినిమా కమిట్మెంట్ల వల్ల ఎన్టీఆర్ ఆ షో చేయలేను అని చెప్పారట.

ఎన్టీఆర్ సినిమాలు

ఎన్టీఆర్ సినిమాలు

ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలకు కమిటై అందుకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీ అయ్యారు. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే షూటింగులో జాయిన్ కాబోతున్న ఎన్టీఆర్ ఇది పూర్తయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X