ఒక్కటయ్యారు: అన్నయ్య కోసం జూ ఎన్టీఆర్ క్లాప్ (ఫోటోలు)
హైదరాబాద్: నందమూరి బ్రదర్స్ జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య సత్సంబంధాలు లేవనే వార్తలు ఆ మధ్య వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలన్నీ పటాపంచలు చేస్తూ తాము ఇద్దరం ఒకటే, అన్నదమ్ములుగా ఎప్పటికీ కలిసే ఉంటాము అని నిరూపించారు. తాజాగా అన్నయ్య కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'పటాస్' సినిమాకు క్లాప్ కొట్టారు జూ ఎన్టీఆర్.
కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'పటాస్' షూటింగ్ ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. 'కందిరీగ', 'ఆగడు' వంటి భారీ చిత్రాలకు రచయితగా పని చేసిన అనిల్ రావిపూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న నందమూరి తారకరామారావు ఫోటోపై తీసిన ముహూర్తపు సన్నిశానికి యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగా, నందమూరి జానకిరామ్ కెమెరా స్విచాన్ చేసాడు. తొలి సన్నివేశానికి 'కిక్' సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. నందమూరి హరికృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్లైడ్ షోలో ఫోటోలు, ఇతర వివరాలు...

పటాస్
పటాస్ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించబోతున్నారు. సినిమా మొత్తం ఇంట్రస్టింగ్ ట్విస్టులతో సాగుతుందని దర్శకుడు తెలిపారు.

కళ్యాణ్ రామ్
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. హీరోయిన్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

రెగ్యులర్ షూటింగ్
మే 10 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. శరవేగంగా షూటింగ్ జరిపేందుకు ప్రణాళికలు సిద్దం చేసారు.

నటీనటులు
ఈ చిత్రంలో సాయి కుమార్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ఎమ్మెస్ నారారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం
ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురరారి, సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: తమ్మిరాజు, ఆర్ట్: ఎం.కిరణ్ కుమార్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే: అనిల్ రావిపూడి.


Click it and Unblock the Notifications











