కళ్యాణ్ రామ్ కి సూపర్ క్రేజ్ ('పటాస్‌' పోస్టర్స్)

By Srikanya

హైదరాబాద్ : కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'పటాస్‌'. శ్రుతి సోడి హీరోయిన్. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకొన్నాయి. చిత్రాన్ని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ నేపధ్యంలో చిత్రం కొత్త పోస్టర్స్ ని విడుదల చేసారు నందమూరి కళ్యాణ్ రామ్. ఈ పోస్టర్స్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. స్లైడ్ షో లో ఆ పోస్టర్స్ ని మీకు అందిస్తున్నాం.

దర్శకుడు మాట్లాడుతూ ''వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో తెరకెక్కిన చిత్రమిది. పోలీసు అధికారి పాత్రలో కల్యాణ్‌రామ్‌ చేసే సందడి ఆకట్టుకొంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. సినిమా ఇంటిల్లిపాదినీ మెప్పిస్తుంది''అన్నారు.

చిత్రంలో సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి, సంగీతం: సాయికార్తీక్‌.

స్లైడ్ షో లో ఆ పోస్టర్స్..

తొలిసారిగా...

తొలిసారిగా...

నందమూరి కళ్యాణ్ రామ్ ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘పటాస్'. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు అభిమానుల్లో ఈ సినిమాకి క్రేజ్ పెరిగింది.

వాయిస్ ఓవర్

వాయిస్ ఓవర్

ఈ సినిమాకి ఎన్.టి.ఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడని సమాచారం.

పూర్తి ఎంటర్టైన్మెంట్

పూర్తి ఎంటర్టైన్మెంట్

కళ్యాణ్ రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాడని ఈ చిత్ర యూనిట్ అంటోంది.

పూర్తి నమ్మకం

పూర్తి నమ్మకం

ఈ సినిమాకి హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ పటాస్ విజయం పై చాలా నమ్మకంగా ఉన్నాడు.

పూర్తి నమ్మకం

పూర్తి నమ్మకం

ఈ సినిమాకి హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ పటాస్ విజయం పై చాలా నమ్మకంగా ఉన్నాడు.

కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ....

కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ....

‘‘రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అది. 90 శాతం షూటింగ్‌ పూర్తయింది. దర్శకుడు అనిల్‌ శ్రద్ధగా తీస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా లావిష్‌గా రూపొందిస్తున్నాం. చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.

అందుకే జాప్యం

అందుకే జాప్యం

నందమూరి జానకిరామ్‌ మృతితో కంగుతిన్న కళ్యాణ్‌రామ్‌ తను నటించిన పటాస్‌ చిత్రం విడుదలపై కొంత జాప్యం చేయాల్సి వచ్చింది.

నైజాం రైట్స్

నైజాం రైట్స్

పటాస్‌ చిత్రం నైజాం హక్కుల్ని దిల్‌రాజు కొన్నట్లు తాజా సమాచారం. దిల్‌రాజు రైట్స్‌ కొన్నాడంటే సినిమా బిజినెస్‌ వేగంగా జరుగుతుందన్నమాటే. ఎందుకంటే సినిమాపై నమ్మకం ఉంటేనే దిల్‌రాజు సినిమా హకుల్ని తీసుకుంటారని వినికిడి.

ఆంధ్రా హక్కుల్ని మాత్రం..

ఆంధ్రా హక్కుల్ని మాత్రం..

ఒక్క ఆంధ్రా హకుల్ని మాత్రం కళ్యాణ్‌రామ్‌ తీసుకుని మిగిలిన హక్కుల్ని దిల్‌రాజుకు అప్పగించినట్లు సమాచారం.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ...

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ...

ఆది సినిమా చూసిన నేను చేస్తే ఇలాంటి కమర్షియల్‌ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే ఈ కథను తయారుచేసుకున్న తర్వాత రెండేళ్లు ఎదురుచూశాను. ఈ సినిమా ఇంత బాగారావడానికి నందమూరి కళ్యాణ్‌రామ్‌ కారణం. సిని మాలో కొత్త కళ్యాణ్‌రామ్‌ను చూస్తారుఅని అన్నారు.

సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ మాట్లాడుతూ...

సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ మాట్లాడుతూ...

అన్ని ఎలిమెంట్స్‌ కుదిరిని సినిమా ఇది. మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అవ్ఞతుంది. నేను చేసిన పెద్ద కమర్షి యల్‌ సినిమా ఇదే. ఈ చిత్రంలో అవకాశమిచ్చిన ఇచ్చినందుకు దర్శకు డు అనిల్‌, నిర్మాత కళ్యాణ్‌రామ్‌కి థాంక్స్‌. సినిమా పెద్ద హిట్టవ్ఞతుంది అని తెలిపారు.

హీరోయిన్‌ శృతిసోధి మాట్లాడుతూ...

హీరోయిన్‌ శృతిసోధి మాట్లాడుతూ...

ఈ సినిమాలో చాలా మంచి రోల్‌ చేశాను. కళ్యాణ్‌రామ్‌ మంచి కోస్టార్‌అని తెలిపారు.

ప్లాటినమ్ డిస్క్ వేడుక

ప్లాటినమ్ డిస్క్ వేడుక

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయని, త్వరలోనే ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపనున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.

తెర ముందు

తెర ముందు

ఈ సినిమాలో సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

తెర వెనక

తెర వెనక

ఈ సినిమాకు కెమెరా: సర్వేష్‌ మురారి, సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిటింగ్‌: తమ్మిరాజు, ఆర్ట్‌: ఎం.కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X