గోవాలో బికినీ బేబ్స్‌తో కమెడియన్ పాట్లు(ఫోటో ఫీచర్)

By Srikanya

బెంగుళూరు: కమిడియన్ నుంచి హీరోగా ఎదిగిన కన్నడ నటుడు కోమల్ కుమార్. అతను రీసెంట్ గా గోవా బీచ్ లో బికినీ భామలతో నాటి పనులు చేస్తూ కనిపించాడు. ఆ ఫోటోలు మీడియాకు విడుదల చేసారు. అవి ఇప్పుడు అంతటా క్రేజ్ గా మారాయి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోనూ ఈ ఫోటోలకు మంచి ఆదరణ వస్తోంది. అయితే ఇవన్నీ గోవా అనే చిత్రంలోవి అని తర్వాత తేల్చారు.

వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వైభవ్‌-స్నేహ జంటగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య నిర్మించిన ఓ తమిళ చిత్రం 'గోవా'. దాన్ని కన్నడంలో కాపీ కొట్టి చేస్తున్నారని టాక్. ఈ మేరకు గోవాలో బికినీ బేబీలపైన కోమల్ కాంబినేషన్ లో సీన్స్ తీసారు. చిత్రంలో చాలా అడల్ట్స్ జోక్స్ ఉన్నాయి. అవి తప్పకుండా ఆకట్టుకుంటాయని చెప్తున్నారు.

చిత్రం కథ ఏమిటంటే...ముగ్గురు స్నేహితులు గోవా చూడడానికి వెడతారు. అక్కడ ముగ్గురూ ముగ్గురమ్మాయిలను ప్రేమిస్తారు. అనుకోకుండా ఆ ముగ్గురు అమ్మాయిలవల్ల సమస్యల్లో పడతారు స్నేహితులు. వారు ఆ సమస్యలనుండి ఎలా బయటపడ్డారన్నదే చిత్ర కథాంశం.

మిగతా కథనం..స్లైడ్ షోలో...

హ్యాంగోవర్ కాపీనా

హ్యాంగోవర్ కాపీనా

హాలీవుడ్ లో హిట్టైన హ్యాంగోవర్ కాన్సెప్టుతో ఈ చిత్రం రూపొందుతోందని అక్కడ మీడియా చెప్తోంది. పనీపాటా లేని ముగ్గురు కుర్రాళ్లు గోవాలో ఎంజయ్‌ చేయడానికి వెళ్లి...అక్కడ ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడతారు. క్రమంగా వారి పరిచయం పెద్ద సమస్యలో చిక్కుకునేలా చేస్తుంది. దానినుంచి ఎలా బైటపడ్డారనదే సినిమా కథ' అని దర్శకుడు చెప్తున్నారు. ఈ చిత్రంలో హాంగోవర్ ఛాయలు ఉంటాయని అంటున్నారు.

ఖండన

ఖండన

ఈ చిత్రాన్ని శంకర్ గౌడ, శంకర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. వారు ఈ చిత్రం తమిళ చిత్రానికి రీమేక్ కాదని అంటున్నారు. ఈ కథని తాము చాలా కాలంగా తయారు చేసుకున్నదే అని అంటున్నారు. సినిమా మొత్తం కామెడీతో ఉంటుందని చెప్తున్నారు.

హాట్ హాట్ గా...

హాట్ హాట్ గా...

సినిమాలో హాట్ సీన్స్ కి కొదవ ఉండదని అంటున్నారు. కోమల్ ఈ చిత్రం పూర్తి కామెడీ పాత్రను పోషిస్తున్నాడని..అతను వేసే పంచ్ లు నవ్విస్తాయని అంటున్నారు. ఇక సినిమా చూసిన వారు బాగా ఎంజాయ్ చేస్తారని నిర్మాత హామీ ఇస్తున్నారు.

సుదీప్ అండతో..

సుదీప్ అండతో..

ఈ చిత్రాన్ని ఈగ విలన్ సుదీప్ లాంచ్ చేసారు. మొసూరు,బెంగుళూరు, గోవా ప్రదేశాల్లో మొత్తం షూటింగ్ ఫినిష్ చేస్తారు. సినిమా చాలా క్వాలిటీగా వస్తోందని, కోమల్ కెరీర్ లో బెస్ట్ చిత్రం అవుతుందని దర్శకుడు అంటున్నారు.

బ్రిటన్ నటి

బ్రిటన్ నటి

ఈ చిత్రం ద్వారా బ్రిటన్ నటి రేచల్ కన్నడ పరిశ్రమకు పరిచయమవుతోంది. ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతూంటే..ఈ హీరోలు దాన్ని అర్దం చేసుకుని ప్రొసీడ్ అవ్వటానికి పడే తిప్పలు నవ్వులు కురిపిస్తాయని అంటున్నారు.

 డాన్ 2 లో..

డాన్ 2 లో..

రేచన్ గతంలో షారూఖ్ ఖాన్ డాన్ 2 లో చేసింది. ఆ తర్వాత హిందీలో కనిపించినా కన్నడంలో ఇదే ఆమె తొలి ఎంట్రీ. ఆమెకు మంచి రెస్పాన్స్ వస్తుందని,ఆమెకు హీరోలకు మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్ గా ఉంటాయని రచయిత అంటున్నారు.

ఇదే టైటిల్ తో...

ఇదే టైటిల్ తో...

గోవా టైటిల్ ని గతంలో వేరే నిర్మాత తమ సినిమాకు పెట్టారు కానీ కారణాంతాల వల్ల మార్చేసారు. అయితే తమ కథ పూర్తిగా గోవాలో జరుగుతుంది కాబట్టి టైటిల్ జస్టిఫికేషన్ ఉంటుందని, గోవా అందాలతో పాటు బికినీ భామల అందాలు సైతం సినిమాలో చూడవచ్చు అంటున్నారు.

అల్లరి నరేష్ హీరోయిన్...

అల్లరి నరేష్ హీరోయిన్...

ఈ చిత్రంలో అల్లరి నరేష్ తో రీసెంట్ గా..కెవ్వు కేక చిత్రంలో చేసిన షర్మిలా మండ్రే హీరోయిన్ గా కనిపిస్తోంది. మనీషా యాదవ్, అశోక్, శోభరాజ్, రమేష్ భట్, ధర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. కోమల్ సినిమాకు హీరో.

డైలాగ్స్ హైలెట్

డైలాగ్స్ హైలెట్

ఈ చిత్రానికి డైలాగ్స్ ..మఠ, ఎద్దేల మంజు నాధ చిత్రాల దర్శకుడు గురు ప్రసాద్ మాటలు అందిస్తున్నారు. ఆయన రాసే పంచ్ డైలాగులు జనాల్ని నవ్వుల్లో ముంచెత్తుతాయని చెప్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్ కట్ట కెమెరామెన్ గా చేస్తూంటే అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు.

అదే తెలుగులో..

అదే తెలుగులో..

కోమల్ హీరోగా వచ్చిన గోవిందాయ నమహ చిత్రమే ఇప్పుడు తెలుగులో మంచు మనోజ్ హీరోగా..పోటు గాడుగా తెరకెక్కుతోంది. ఈ గోవా చిత్రమూ హిట్టైతే తెలుగులోకి వచ్చే అవకాసం ఉంది. కోమల్ అక్కడ వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X